న్యూఢిల్లీ : మొబైల్ టవర్ సిగ్నల్ లేని చోట కూడా ఫోన్ కాల్స్ చేసుకునే అవకాశం కల్పిస్తూ బీఎస్ఎన్ఎల్ సరికొత్త శాటిలైట్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అడవులు, సముద్ర ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, విపత్తులు సంభవించిన చోట ఈ ఫోన్‌తో మాట్లాడొచ్చు. దీని ధర రూ.1,34,166. దీనిని సొంతం చేసుకోవాలంటే ముందుగా కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
అనుమతి లేకుండా దీనిని వాడటం చట్టపరమైన సమస్యలను తెచ్చిపెడుతుంది. ఈ ఫోన్ నేరుగా ఉపగ్రహాలతో అనుసంధానం అవుతుంది. దీంతో సెల్యులార్ నెట్వర్క్ లేని ప్రాంతాల్లోనూ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. రక్షణ శాఖ, సముద్ర రవాణా, విపత్తు నిర్వహణ బృందాలు, గనుల పరిశ్రమ, మారుమూల ప్రాంతాల్లో పనిచేసే సంస్థలు, సాహస యాత్రికులు..మొదలైనవారిని దృష్టిలో పెట్టుకొని శాటిలైట్ ఫోన్‌ను రూపొందించారు.