కలెక్టర్ హరిచందన
ఉపాధ్యాయులు తయారు చేసిన ప్రయోగాల పరిశీలన
ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు
ధన్వాడ, మార్చి 11 : ఉపాధ్యాయులు తయారు చేసిన ప్రయోగాలతో విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బోధన అందించాలని కలెక్టర్ హరిచందన కోరారు. మండలకేం ద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. కార్యక్రమానికి మద్దూర్, కోస్గి, దామరగిద్ద్ద, ధన్వాడ మండలాలకు చెందిన ఉపాధ్యాయులు తయారు చేసిన సైన్స్ ప్రయోగాలను కలెక్టర్‌తోపాటు డీఈవో అలీ, జిల్లా అధికారులు ఈశ్వరయ్య, విద్యాసాగర్ సందర్శించి తిలకించారు. పాఠశాలల వారీగా ఉపాధ్యాయులు ప్రయోగాలను తయారు చేశారు. ప్రయోగాల ఉపయోగంపై కలెక్టర్ వారిని అడిగి తెలుసుకున్నారు. ధన్వాడ సంత బజార్ పాఠశాల ఉపాధ్యాయుడు కెంచె బా లరాజు, మరికల్ శ్రీనివాసులు తయారు చేసిన రాకెట్ ప్ర యోగం, మందిపల్లి తండా ప్రధానోపాధ్యాయుడు నరేందర్ తయారు చేసిన ప్రయోగాలపై కలెక్టర్ వారిని అభినందించారు. అదేవిధంగా వివిధ మండలాల నుంచి వచ్చిన విద్యార్థులు చేసిన డ్యాన్స్‌లు, నాటికలు ఆకట్టుకున్నాయి. పాఠశాల ఆవరణలో పండుగ వా తావరణం నెలకొంది. కార్యక్రమంలో స ర్పంచ్ అమరేందర్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ పి.రామచంద్రయ్య, ఎంపీటీసీలు గోవర్ధన్‌గౌడ్, ఉమేశ్కుమార్గుప్తా, మాధవి, జీహెచ్ఎం రమేశ్, కందూ ర్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
క్రీడాకారులకు అభినందనలు
రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీల్లో ప్రతిభ కనబర్చిన మండలంలోని కొండాపూర్ ఎస్టీ గురుకుల పాఠశాల విద్యార్థులను శుక్రవారం కలెక్టర్ అభినందించారు. రాష్ట్రస్థాయి చాంపియన్‌షిప్‌లో అందుకున్న బంగారు పత కం, సర్టిఫికెట్లను కలెక్టర్ నుంచి అందుకున్నారు. అదేవిధం గా జీహెచ్ఎం రమేశ్‌ను కలెక్టర్ శాలువా తో సన్మానించి, సర్టిఫికెట్ అందించారు. టీఎంఎల్ మేళాకు హాజరైన ఉపాధ్యాయులకు కలెక్టర్ సర్టిఫికెట్లను అందజేశారు.