మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ఏర్పాటైన తర్వాత పాలమూరు దశ మారుతున్నది. టీఆర్ఎస్ సర్కార్ సాగునీటి రంగాన్ని విస్తరిస్తూనే.. మరోవైపు పారిశ్రామిక రంగంపైనా దృష్టి సారించింది. కరువు, వలసలకు ప్రసిద్ధి చెందిన మహబూబ్‌నగర్ జిల్లా ఇప్పుడు పారిశ్రామికంగా ముందంజ వేస్తున్నది. పరిశ్రమల స్థాపనలో రాష్ట్రంలోనే ఐదో స్థానంలో నిలిచి వలసల జిల్లాకే వలసలు వచ్చేలా చేస్తున్నది. టీఎస్ ఐపాస్ ద్వారా సింగిల్ విండో విధానంలో అనుమతులివ్వడంతో జిల్లాలో అనేక పరిశ్రమలు పెట్టుబడులు పెడుతున్నాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే జాతీయ రహదారికి సమీపాన ఉన్న పోలేపల్లి సెజ్‌తోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏడేండ్లలో 20 భారీ పరిశ్రమలతో సహా చిన్న కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టాయి. వీటి ద్వారా 21,334 మందికి ప్రత్యేక్షంగా, వేలాది మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరిగాయి. ప్రఖ్యాత ఫార్మా, సోలార్ సహా వివిధ కంపెనీలు తరలివచ్చాయి. అరబిందో ఫార్మా, విర్కో పెట్రోకెమికల్స్, శిల్పా మెడికేర్, హిందూస్థాన్ ఫుడ్స్, డీఎస్ఎం న్యూట్రీషన్ ప్రొడక్ట్స్ తదితర ప్రఖ్యాత కంపెనీలతోపాటు అనేక ఇతర కంపెనీలు తరలివచ్చాయి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. మరోవైపు మహబూబ్‌నగర్ సమీపంలోని దివిటిపల్లి వద్ద నిర్మిస్తున్న ఐటీ పార్కును త్వరలో పూర్తి చేసి పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలను తీసుకొచ్చేందుకు సర్కార్ ప్రయత్నిస్తున్నది.
అందుబాటులో అంతర్జాతీయ విమానాశ్రయం..
పాలమూరు జిల్లాలో రోడ్ల విస్తరణ జరగడంతో అభివృద్ధికి ఊతం ఏర్పడింది. హైదరాబాద్ నుంచి జడ్చర్ల మీదుగా బెంగళూరు, కోదాడ నుంచి జడ్చర్ల, మహబూబ్‌నగర్ మీదుగా బళ్లారి వరకు హైవేలు విస్తరించారు. దీనికితోడు రైల్వే ప్రయాణ సౌకర్యం కూడా అందుబాటులో ఉన్నది. దీంతో మహబూబ్‌నగర్, జడ్చర్ల పట్టణాల నుంచి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (జడ్చర్ల నుంచి 68 కి.మీ.) కేవలం గంట వ్యవధిలో చేరుకునే అవకాశం ఏర్పడింది. కొత్త పరిశ్రమలను మరింతగా ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విజయవంతమయ్యాయి. ఫార్మా, సోలార్ కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి. పోలేపల్లి సెజ్‌లో కొత్త పరిశ్రమల స్థాపనకు టీఎస్ఐఐసీ కృషి చేస్తున్నది. ఏడేండ్లలో కొత్తగా 20 కంపెనీలు రావడంతోపాటు జిల్లాలో 205 చిన్న, మధ్య తరహా కంపెనీలు ప్రారంభమయ్యాయి. అన్ని కంపెనీలు కలిసి రూ.7,647 కోట్ల పెట్టుబడులు పెట్టాయి.
హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధి..
ఒకప్పుడు మహబూబ్‌నగర్ వాసులను వలస కూలీలు అనే వారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత సీఎ కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో జిల్లా రూపురేఖలే మారుతున్నాయి. మంత్రి కేటీఆర్ ఆలోచనలకు ప్రతిరూపమైన టీఎస్ ఐపాస్ ద్వారా సింగిల్ విండో విధానంలో పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపించేందుకు అవకాశం కల్పించారు. పరిశ్రమల సంఖ్య పెరిగింది. అంతర్జాతీయ విమానాశ్రయం, జాతీయ హైవేలు, రైల్వే కనెక్టివిటీ ఉండడంతో నూతన పరిశ్రమల స్థాపనకు అనేక మంది తరలివస్తున్నారు. దివిటిపల్లి సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఐటీ, ఇండస్ట్రియల్ కారిడార్‌తో అటు ఐటీ పరిశ్రమలతోపాటు ఇండస్ట్రీస్ సైతం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సిద్ధం అవుతున్నాం. ఒకప్పుడు బతుకుదెరువు కోసం ముంబై వెళ్లిన ప్రజలకు ఇప్పుడు ఇక్కడే ఉపాధి చూపిస్తున్నాం. భవిష్యత్‌లో హైదరాబాద్ స్థాయిలో పాలమూరును అభివృద్ధి చేస్తాం.
పరిశ్రమల ఏర్పాటుతో అభివృద్ధి..
పరిశ్రమల ఏర్పాటుతో పాలమూరులో వలసలు తగ్గాయి. దీంతోపాటు ఇతర ప్రాంతాల నుంచే ఇక్కడికి ఉపాధి కోసం వచ్చే వారి సంఖ్య పెరుగుతున్నది. పోలేపల్లి సెజ్‌లో ఏర్పాటైన పరిశ్రమలతో స్థానికులకు ఉద్యోగావకాశాలు పెరిగాయి. వివిధ రాష్ర్టాలకు చెందిన అనేక మంది ఉద్యోగాల కోసం వచ్చి జడ్చర్ల పట్టణంలో నివాసం ఉంటున్నారు. సెజ్ లో సుమారు 10 వేల మంది, ఇతర పరిశ్రమల్లో మరో 10 వేలకుపైగా ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు పనిచేస్తున్నారు. దీంతో జడ్చర్ల, మహబూబ్‌నగర్ పట్టణాల్లో పరోక్షంగా అనేక మందికి ఉపాధి అవకాశాలు పెరిగాయి. దుకాణాలు, వ్యాపారాలు భారీగా పుట్టుకొచ్చాయి. ఊహించని విధంగా అద్దెలు కూడా పెరిగాయి. దీంతో కొత్తగా గృహ నిర్మాణా లు చేపడుతున్నారు. ఒకప్పుడు సింగిల్ బెడ్రూం రూ.2 వేల అద్దెకు ల భించేది. ఇప్పుడు కనీసం రూ.6 వేలు పెడితే తప్పా సింగిల్ బె డ్రూం లభించని పరిస్థితి ఏర్పడింది. ఉమ్మ డి జిల్లాలోనే ఎక్కువ అద్దెలు న్న పట్టణంగా జడ్చర్ల రికార్డు సృష్టి