
నారాయణపేట, సెప్టెంబర్8: వినాయక ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకొందామని ఎస్పీ డాక్టర్ చేతన ప్రజలకు పిలుపునిచ్చారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ప్రజాప్రతినిధులు, మతపెద్దలు, ఉత్సవ కమిటీ సభ్యులతో అదనవు కలెక్టర్ చంద్రారెడ్డితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోనే నారాయణపేట జిల్లా గణేశ్ ఉత్సవాలకు మంచి పేరుందన్నారు. కాలుష్య నివారణకు అందరూ మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించాలని ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వల్ల నీరు కలుషితమై పర్యావరణం దెబ్బ తింటుందన్నారు. నిమజ్జనం సమయంలో విద్యుత్, అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రతి వినాయక మండపం వద్ద ఒకరు బాధ్యతగా ఉండాలన్నారు. చెరువుల వద్ద క్రేన్, విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు మురళి, లియాఖత్‌అలీ, నరేందర్, రాములు, మున్సిపల్ కమిషనర్ భాస్కర్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గందె అనసూయచంద్రకాంత్, డీఎస్పీ మధూసూదన్‌రావు, వైస్ చైర్మన్ హరినారాయణభట్టడ్, సీఐ శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రశాంతంగా జరుపుకోవాలి
మిడ్జిల్, సెప్టెంబర్ 8 : గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఇన్చార్జి ఎస్సై అశోక్‌బాబు సూచించారు. బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ప్రజాప్రతినిధులు, యువసన సంఘాల సభ్యులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గణేశ్ విగ్రహాలు ప్రతిష్ఠించేవారు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని తెలిపారు. అలాగే ప్రభుత్వ నిబంధనల మేరకు ఉత్సవాలను నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఎంపీటీసీలు గౌస్, నర్సింహులు, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు జంగారెడ్డి, సర్పంచ్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జాగ్రత్తలు పాటించాలి
మూసాపేట(అడ్డాకుల), సెప్టెంబర్ 8 : గణేశ్ ఉత్సవాల్లో జాగ్రత్తలు పాటించాలని ఎస్సై విజయ్‌కుమార్ సూచించారు. అడ్డాకుల పోలీస్‌స్టేషన్‌లో గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులతో బుధవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.