మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, సెప్టెంబర్ 8 : 11న ని ర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌కు కక్షిదారులు పెద్ద సంఖ్యలో హాజరై వారి కేసులను పరిష్కరించుకోవాలని మహబూబ్‌నగర్ జిల్లా జడ్జి ఎస్.ప్రేమవతి సూ చించారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా కోర్టు స ముదాయంలోని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కోర్టుల్లో 26,938 కేసులు పెండింగ్‌లో ఉండగా జాతీయ లోక్ అదాలత్‌లో 2,809 కేసులు పరిష్కరించాలని గుర్తించినట్లు తెలిపారు. లోక్ అదాలత్‌లో సివిల్ కేసులతోపాటు కుటుంబ కలహాలకు, ఎక్సైజ్, ఎలక్ట్ట్రిసిటీ, రోడ్డు ప్రమాదాలు వంటి కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. అలాగే రాజీ పడగలిగే క్రిమినల్ కేసులను కూడా పరిష్కరించుకోవచ్చని స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్‌లో 5, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అ చ్చంపేట, అలంపూర్, ఆత్మకూర్, కొడంగల్, కల్వకుర్తి లో ఒక్కో బెంచ్, షాద్‌నగర్, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌లో మూడేసి చొప్పున, నారాయణపేటలో 2, జడ్చర్లలో 1, కొల్లాపూర్‌లో ఒకటి కలిపి మొత్తం 26 బెంచీలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కేసులను ప్రత్యక్ష పరిష్కారంతోపాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిష్కరిస్తామన్నారు. సమావేశంలో మొదటి అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి టి. రఘురాం, ఏడో అడిషనల్ అండ్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి రమాకాంత్, ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి ఎన్. వెంకట్రాం, జిల్లా లీగల్ సర్వీసె స్ అథారిటీ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఎం.సంధ్యారాణి, జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ దీప్తి, జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ (ప్రొహిబిషన్, ఎక్సైజ్ కోర్టు) కే.శిరీష తదితరులు పాల్గొన్నారు.