
వనపర్తి, సెప్టెంబర్ 8 : సాధారణంగా చాలా మం ది పాత వాహనాలను కొనుగోలు చేస్తుంటారు. తెలిసిన వ్యక్తే కదా.. అని కేవలం సాదా కాగితాలపై వి క్రయ ఒప్పందాన్ని రాసుకుంటుంటారు. ఇలా వాహనాలు ఒకరి నుంచి మరిన నేపథ్యంలో కొనుగోలు చేసిన వ్యక్తి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లఘించి చలాన్ పడితే నెంబర్ ప్లేట్ ఆధారంగా నేరుగా యాజమాని ఇంటికే వస్తుంది. ఇది ఒక్కరి పరిస్థితి కాదు.. చాలా మంది ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే వాహనం కొన్నా.. అమ్మినా.. వెంటనే యాజమాన్య హక్కులు మార్చుకోవాలని రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు. బైక్, ఫోర్ వీలర్, ఆటో, ఇతర వాహనాలను కొత్త వాటి కన్నా సెకండ్ హ్యాండ్ వ్యాపారం జోరుగా సాగుతుంది. ఆర్థికంగా ఉన్నవా రు, నెలసరి ఆదాయం వచ్చే వారు వాయిదా పద్ధతి లో పాతది అమ్మి.. కొత్తది కొంటున్నారు. ఇలాంటి వారు పాత వాహనాన్ని అప్పజెప్పే ముందు యాజమాన్య హక్కులు తప్పనిసరిగా బదిలీ చేసుకోవాలి. లేకుంటే కేసులు, ఫైన్లు, జరిమానాలు వంటి ఇబ్బందులు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.
సెకండ్‌హ్యాండ్ వాహనం కొనుగోలు చేసిన వెం టనే ఫారం 29, 30పై విక్రయించిన వారి సంతకాలు, ఆధారాలు తీసుకుంటే రవాణా శాఖ కార్యాలయంలో యాజమాన్య బదిలీ సులభమవుతుంది. అయితే, సం తకం చేసి కార్యాలయానికి సమాచారం ఇచ్చినప్పటి నుంచి రాష్ట్ర పరిధిలోని వాహనాలైతే 15 రోజుల్లో, ఇతర రాష్ట్ర వాహనాలైతే 30 రోజుల్లో యాజమాన్య హక్కులు బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో వాహనదారులు కచ్చితంగా వ్యవహరించి బ దిలీ ప్రక్రియను పూర్తి చేశాకే కొనుగోలుదారుడికి వా హనాన్ని అప్పగించాలి. లేకుంటే కొనుగోలుదారుడు వాహనం ద్వారా ఎలాంటి నేరం చేసినా అసలు యజమాని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నిత్యం రోడ్లపైకి వచ్చే వాహనాల్లో చాలా శాతం యజమానులు కాకుండా ఇతరులు న డుపుతున్నారని రవాణాశా ఖ అధికారులు చెబుతున్నారు. యాజమాన్య హక్కులు బదిలీ చే సుకోకుంటే వాహ నం ప్రమాదానికి గురైనప్పుడు లే దా ఎవరినైనా ఢీ కొట్టినప్పుడు య జమాని, డ్రైవింగ్ చేసిన వారికి ఇద్దరికి కష్టాలు తప్పవని సూ చిస్తున్నారు.
హక్కులు మార్చుకున్నాకే అప్పగించాలి..
సాధారణంగా విక్రయదారులు వాహనాన్ని అమ్మిన వెంటనే కొనుగోలుదారుడికి అప్పగిస్తున్నారు. ఇది సరి కాదు. హక్కులు బదిలీ చేసిన తరువాతే వాహనాన్ని అప్పగించాలి. లేకుంటే వాహన విక్రయదారులు తమ పేరిట ఉన్న వాహనం చేసే నేరాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ విషయంపై అందరూ అవగాహన కలిగి ఉండాలి.