
కోస్గి, సెప్టెంబర్ 1 : 00000000000000మీడియాను అడ్డం పెట్టుకొని ప్రముఖ చానళ్లలో కాంగ్రెస్ నాయకులు అసత్య ఆరోపణలు చేయిస్తూ టీఆర్ఎస్ నాయకులపై బురదజల్లడం సరికాదని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రముఖ చానళ్లలో టీఆర్ఎస్ నాయకులపై, కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి చుట్టాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని వచ్చిన అసత్య వార్తలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఎమ్మెల్యేకు వరుసకు తాతనైన తనపై(హన్మంత్‌రెడ్డి) రాజకీయాలు చేస్తున్నానని, కాంగ్రెస్ నాయకులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని, వచ్చిన అసత్య వార్తలను ప్రజలు ఎవరూ నమ్మరన్నారు.
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డబ్బులు ఇచ్చి చానళ్లతో అసత్య వార్తలు చేయించ డం మానుకోవాలన్నారు. కొడంగల్ ఎమ్మెల్యేగా నరేందర్‌రెడ్డి వచ్చాకనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందన్నారు. ఎమ్మెల్యేను అడ్డం పెట్టుకొని నేను చేసిన రాజకీయం ఏముందో తెలుపాలన్నారు. కాంగ్రెస్ నాయకులను బెదిరించారన్న ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. ఇప్పటికైనా అసత్య ఆరోపణలు మానుకొని కాంగ్రెస్ నాయకులు అభివృద్ధికి కలిసి రావాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ప్రకాశ్‌రెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు ఓంప్రకాశ్, నాయకులు హరి, జగదీశ్వర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.