
మక్తల్ టౌన్, సెప్టెంబర్ 1 : రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో మక్తల్ విద్యార్థులు నాలుగో ర్యాంక్ సాధించారని టగ్ ఆప్ వార్ అసోసియేషన్ మండ ల అధ్యక్షుడు, విశ్రాంత పీఈటీ గోపా లం అన్నారు. ఆగస్టు 28 నుంచి 31 వ తేదీ వరకు సిద్దిపేట జిల్లాలో జరిగి న రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో మండలంలోని కర్ని గ్రామానికి చెందిన నిరీ ష, నిఖిత, గుర్లపల్లి గ్రామానికి చెంది న అనిత ప్రతిభ కనబర్చి నాలుగో స్థా నం సాధించి ప్రశంసా పత్రం, బహుమతి పొందారు. బుధవారం మక్తల్ మినీ స్టేడియంలో నాలుగో ర్యాంక్ సాధించిన క్రీడాకారులను టగ్ ఆప్ వార్ అసోసియేషన్ ఆధ్వర్యం లో ఘనంగా సన్మానించారు.
ఆగస్టు 22న ఉమ్మడి జిల్లాలో జరిగిన జూనియర్ ఖోఖో పోటీల్లో అర్హత సాధించిన అనంతరం రాష్ట్రస్థాయిలో నాలుగో ర్యాంక్ సాధించిన క్రీడాకారులను విశ్రాంత పీఈటీ గోపాలం, జిల్లా అథ్లెటిక్ అధ్యక్షుడు నర్సింహగౌడ్ అభినందించారు. కార్యక్రమంలో టగ్ ఆప్ వార్ గౌరవాధ్యక్షుడు రఘుప్రసన్న భట్, పీఈటీలు రూప, దామోదర్, మీనాకుమారి, విష్ణువర్ధన్‌రెడ్డి, టగ్ ఆప్ వార్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.