కోస్గి, ఆగస్టు25: మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేయనున్న పార్క్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, పాలబావి ప్రాంతంలో చేపట్టే పార్క్‌తో స్థానికులకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, కలెక్టర్ హరిచందన అన్నారు. పార్క్ నిర్మాణానికి కలెక్టర్ హరిచందనతో కలిసి భూమిపూజ చేశారు. పాలబావి వద్ద ఉన్న భూమి విస్తీర్ణంపై కాంగ్రెస్ నాయకులు అనుమానం ఉందని ఆరోపించడంతో ఎమ్మెల్యే స్పందించారు. రెండు రోజుల్లో కలెక్టర్ సమక్షంలో సర్వే నిర్వహిస్తామని, ఎవరూ ఆ భూమిని కబ్జా చేసినా ఊరుకోబోమన్నారు. రూ.80లక్షలతో పార్క్ అద్భుతంగా ఏర్పాటు చేస్తామన్నారు. మున్సిపాలిటీలో చేపట్టేందుకు తీర్మానం చేసిన ప్రతి పని త్వరలో ప్రారంభించాలని ఏఈ విలోక్ను కలెక్టర్, ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం స్థానిక శివాజీ చౌరస్తాలో రోడ్డువిస్తరణలో భాగంగా విగ్రహాల ఏర్పాటు, లైటింగ్ తదితర అంశాలను పరిశీలించారు.
శివాజీ చౌరస్తా వద్ద హార్టికల్చర్ కార్యాలయ స్థలం 36గుంటలు ఉందని, స్థలం ఎవరైనా కబ్జాచేస్తే తొలగించాలని, అక్రమ డబ్బాలను తొలగించాలని కమిషనర్‌ను కలెక్టర్ ఆదేశించారు. మండలంలోని పోలేపల్లి గ్రామంలో క్రిమిటోరియం, పల్లెప్రకృతి వనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం సర్జాఖాన్‌పేట, చంద్రవంచ గ్రామంలో రైతువేదిక, పల్లె ప్రకృతివనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రామకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ శిరీష, జెట్పీటీసీ ప్రకాశ్‌రెడ్డి, ఎంపీపీ మధుకర్‌రావు, ఆయా శాఖల అధికారులు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.