మిడ్జిల్, ఆగస్టు 17: మొహర్రం వేడుకలను అన్నివర్గాల ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలని సీఐ జములప్ప పేర్కొన్నారు. మండలకేంద్రంలోని పోలీస్స్టేషన్లో మంగళవారం మొహర్రం వేడుకల నిర్వాహకులు, మతపెద్దలు, ప్రజాప్రతినిధులు, నాయకులతో సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పండుగ సమయం లో గొడవలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతియుత వాతావరణంలో, కులమతాలకు అతీతంగా వేడుకలను జరుపుకోవాలని సూచించారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకో కుండా నిర్వహించుకోవాలన్నారు. ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశంలో ఎస్సై జయప్రసాద్, ఎంపీటీసీ గౌస్, సర్పంచ్ నారాయణరెడ్డి, పీఏసీసీఎస్ వైస్ చైర్మన్ అల్వాల్రెడ్డి, వెంకట్రెడ్డి, శ్రీనివాసులు, సిరాజ్, రవి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.