మహబూబ్‌నగర్ టౌన్, మే 3 : మత సా మరస్యానికి ప్రతీక మన తెలంగాణ రాష్ట్రమని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణకు, హైదరాబాద్‌కు విలువ పెరిగిందన్నారు. మంగళవారం రంజాన్ పండుగను పురస్కరించుకొని మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని రహెమానియా ఈద్గా వద్దకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు చేరుకొని ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వాతంత్య్రం రాక ముందు నుంచి ఉమ్మడి రాష్ట్రంలో, ప్రత్యేకించి హైదరాబాద్‌లో ప్రజలు గంగా, జమున తెహజీబ్లా కలిసి మెలిసి జీవించే వారన్నారు. దేశంలో ఎలాంటి మత ఘర్షణలు లేని రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు.
పాలమూరులో రంజాన్ పండుగ సందర్భంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అనంతరం కౌమి ఎక్తా కమిటీ ప్రతినిధి రఫీక్ ప టేల్ నివాసంలో నిర్వహించిన ఈద్‌మిలాప్ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. కార్యక్రమం లో ఎస్పీ వెంకటేశ్వర్లు, అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహెమాన్, వైస్ చైర్మన్ గణేశ్, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, అడిషనల్ ఎస్పీ రాములు, నాయకులు ఒబేదుల్లా కొత్వాల్, అన్వర్‌పాషా, జాకీర్ అడ్వకేట్, జహంగీర్‌బాబా, రహీం, మోసీన్‌ఖాన్, షేక్ఉమర్, కౌన్సిలర్లు, నాయకులు, అధికారులు, ముస్లింలు పాల్గొన్నారు.
మైనార్టీ సంక్షేమానికి కృషి
వనపర్తి టౌన్, మే 3 : రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం రంజాన్ పండుగను పురస్కరించుకొని వనపర్తి జిల్లా కేంద్రంలోని ఈద్గాలో ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేశారు. ఈద్గా వద్దకు మంత్రి చేరుకొని ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. వీరికి ఎల్లప్పుడూ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. పండుగలను కలిసిమెలిసి జరుపుకొనే సంస్కృతి మన రాష్ట్రంలో ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ శ్రీధర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, కౌన్సిలర్లు రాధాకృష్ణ, కృష్ణ, ఉంగ్లం తిరుమల్, రవి, మైనార్టీ నాయకులు సర్దార్ ఖాన్, గులాంఖాదర్, రహీం, రమేశ్, జహంగీర్, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.