IND vs PAK : ప్రపంచకప్‌లో భారత ఓపెన్ అభిషేక్ శర్మ(0) కీలక పోరులో నిరాశపరిచాడు. పాకిస్థాన్ ఎత్తుగడకు అతడు వికెట్ పారేసుకోగా.. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్(42 నాటౌట్) తడాఖా చూపిస్తున్నాడు. భీకర ఫామ్‌లో ఉన్న ఇషాన్.. బౌండరీలతో హోరెత్తిస్తూ స్కోర్ బోర్డును ఉరికిస్తున్నాడు. ఆయూబ్ వేసిన ఆరో ఓవర్లో ఈ డాషింగ్ బ్యాటర్ రెండు ఫోర్లు బాదడంతో స్కోర్ 50 దాటింది. మరో ఎండ్‌లో తిలక్ వర్మ(10) ఉన్నాడు.
తొలి ఓవర్ వేసిన సల్మాన్ అఘా.. ఐదు బంతుల్లో ఒకే రన్ ఇవ్వడంతో పెద్ద షాట్ ఆడాలనుకున్న అభిషేక్.. 30 అడుగుల వలయంలోనే షాహిన్ అఫ్రిదికి సులువైన క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాతి ఓవర్లో పాక్ సీనియర్ పేసర్ షాహీన్ అఫ్రిదిని బెంబేలెత్తిస్తూ ఇషాన్ కిషన్(52 నాటౌట్) వరుసగా సిక్స్,ఫోర్ బాదాడు.
Taking on the bowling early 🔥
A fifty-plus partnership from Ishan Kishan and Tilak Varma makes it 52/1 after 6 overs 👌
Updates ▶️ https://t.co/IgYYH0TeR9 #TeamIndia | #T20WorldCup | #MenInBlue pic.twitter.com/EPGmP3zFEh
— BCCI (@BCCI) February 15, 2026
అనంతరం సల్మాన్ ఓవర్లోనూ బౌండరీ రాబట్టిన ఇషాన్ .. అబ్రార్ అహ్మద్‌కు సిక్సర్‌తో స్వాగతం పలికాడు. నాలుగో బంతిని ఆఫ్‌సైడ్‌లో ఫోర్‌గా మలిచాడు. ఆయూబో వేసిన ఆరో ఓవర్లో రెండు ఫోర్లు రాబట్టాడీ చిచ్చరపడిగు.. దాంతో.. పవర్ ప్లలో వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది భారత్.