న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) విషయంలో ముగ్గురు ఎన్నికల కమిషనర్ల మధ్య విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తలపై వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన లోక్ జనశక్తి పార్టీ(రామ్‌విలాస్) అధినేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్, రాష్ట్రీయ లోక్ మోర్చా అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా, తెలుగుదేశం పార్టీ ఎంపీ లావు /శ్రీకృష్ణ దేవరాయలు శుక్రవారం స్పందించారు.
ఎన్నికల ప్రక్రియపై ప్రజల ఆందోళనలను ఎన్నికల సంఘం తప్పనిసరిగా పరిష్కరించాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ దీనిపై స్పష్టత ఇవ్వాలని పాట్నాలో విలేకరుల సమావేశంలో వారు సూచించారు.