పిడికిలెత్తిన ఉద్యోగి
ఎంత జెప్పిన గానీ ఏలెటోని సెవ్వు మీద పేను వార్తెనా? సెవిటోని ముందు సెంకూదినట్టు ఉలకడు, పలకడు!
ఎంత జెప్పిన గానీ
ఏలెటోని
సెవ్వు మీద పేను వార్తెనా?
సెవిటోని ముందు
సెంకూదినట్టు
ఉలకడు, పలకడు!
ఒకటో తారీఖని
ఒకటే పదం పాడుతుంటే
సంకలెగరేస్తిమి
సంబురవడ్తిమి.!
ఏండ్ల సంది
తీసుకొన్నట్టే?!
ఇందులో
కొత్తదనమేముంది
సెప్పుకుంటే సిగ్గువాయె
ఊరుకుంటే పానంబాయె!
ఇర్కుటాన వడి
కుడ్తిల వడ్డ ఎల్కతీర్గ
తండ్లాడుతున్నం
కుటిలవాజి గాళ్ల కుట్రలకు
ఎన్ని రోజులు బలిగావాలే?
కడుపుల ఇసం నాల్కనతీపి
ఏరు దాటి తెప్ప తగులబెట్టిన తీర్గ
నమ్మించి నట్టేట్ల ముంచుతుంటే
ఉద్యోగులు ఎన్నాళ్లు భరిస్తరు?
ఉద్యోగులు రెండాకులు
ఎక్కువ జదివినోళ్లు
ఎన్నాళ్లంట ఉద్యోగులు
వాళ్ల చెప్పు కింద తేళ్ల తీర్గ
అణిగి మణిగుంటరు.?
నల్గురు పల్కిందే మాట
నలుగురు మెచ్చిందే నడుత
నల్గురు నడిసిందే బాట!
ఉద్యోగులు ఇప్పుడు
బాధ్యతతో పనిచేస్తూనే
హక్కుల కోసం
పిడ్కిలి బిగించిండ్రు!
– కె. శ్యామ్ ప్రసాద్ 9398507940
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

