న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: నాట్కో ఫార్మా నిధుల సేకరణకు కంపెనీ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రైట్స్ ఇష్యూ ద్వారా సేకరించాలనుకున్న రూ.1,27 9 కోట్ల నిధుల సమీకరణకు బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్టు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. ఇందుకోసం సంస్థ రూ.2 ముఖ విలువ కలిగిన 1,70,58,082 ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నది. ఒక్కో షేరు విలువ రూ.750గా నిర్ణయించింది. దీంతో సంస్థకు రూ.1,279.5 కోట్ల నిధులు సమకూరనున్నాయి. రికార్డు తేదీని అక్టోబర్ 1గా నిర్ణయించింది. అక్టోబర్ 12న ప్రారంభమై, అక్టోబర్ 22న ముగియనున్నది.