కోయిలకొండ, మే 3: మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవని ఎంపీపీ శశికళా, జెడ్పీటీసీ విజయభాస్కర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలోని కొతలాబాద్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. మండలంలో అన్ని గ్రామాల్లో ధాన్యం సేకరిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు నవోదయ చైర్మన్ ఎస్.రవీందర్‌రెడ్డి, సర్పంచ్ చరితాదయాకర్రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణయ్య, రైతు సంఘం కన్వీనర్ మల్లయ్య, వైస్ ఎంపీపీ కృష్ణయ్య, ఏవో రామ్‌పాల్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, రాజవర్ధన్‌రెడ్డి, మాధవరెడ్డి, భీంరెడ్డి, మాధవులు, ఏఈవో ప్రశాంత్ పాల్గొన్నారు.
బల్సుర్గొండలో..
గండీడ్, మే 3: మండలంలోని బల్సుర్గొండలో జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం ధాన్యం కొనుగోలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఇబ్బందులు పడొద్దనే తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. కార్యక్రమంలో పీఏసిసీఎస్ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ, సర్పంచ్ వనజ, ఐకేపీ సిబ్బంది, నాయకులు రాంచంద్రారెడ్డి, భీమయ్య, మధన్‌రెడ్డి పాల్గొన్నారు.