శ్రీరంగాపురం, మే 3 : గ్రామాల్లోని స మస్యలను గుర్తించి తక్షణమే పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని నాగరాల పునరావాస కేంద్రంలోని మొదటి సెంటర్లో మంత్రి పల్లెనిద్ర చేపట్టారు. ముందు గా గ్రామంలో పర్యటించారు. గ్రామ సభలో సమస్యలను తెలుసుకున్నారు. మిషన్ భగీరథ నీటిని అందించాలని ఈఈ మేఘారెడ్డిని ఆదేశించారు. పునరావాస గ్రా మాల్లో కరెంట్ సమస్యను పరిష్కరించాలని సర్పంచ్ నిర్మలారాధాకృష్ణ మంత్రికి విన్నవించగా.. పది రోజుల్లో పూర్తి స్థాయి పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు.
నాగరాలలో 225 మందికి పింఛన్లు ఉన్నాయని, మరో 63 మందికి జూన్ నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామన్నారు. పునరావాస కేంద్రంలో 986 కుటుంబాలను గుర్తించి.. వారికి ప్లాట్లు, ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. 18 ఏండ్లు పైబడిన వారిని గుర్తించి పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇవ్వాలని తాసిల్దార్ సుజాతను ఆదేశించారు. అంతకుముందు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రా న్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, ఎంపీపీ గాయిత్రి, వైస్ ఎంపీపీ మహేశ్వర్‌రెడ్డి, పెబ్బేర్ సింగిల్‌విండో చైర్మన్ కోదండరామిరెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు గౌడనాయక్, వైస్ చైర్మన్ జగన్నాథనాయుడు, నాయకులు కురుమయ్య, వెంకటేశ్వర్‌రెడ్డి, రాజవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.