మహబూబ్‌నగర్, మే 3 : నిరుపేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వారి సంక్షేమాన్నవుతానని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. మంగళవారం మహబూబ్‌నగర్ రూరల్ మండలం రాంచంద్రాపురం, వెంకటాపూర్ గ్రామాలకు చెందిన బీజేపీ నాయకులు, ఎదిరకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి మంత్రి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరు ఎన్ని ఇబ్బందు లు సృష్టించినా మహబూబ్‌నగర్‌ను హైదరాబాద్‌కు దీ టుగా తీర్చిదిద్దుతామన్నారు.
పార్టీలో చేరిన వారికి రా బోయే రోజుల్లో మంచి అవకాశాలు ఉంటాయని చెప్పా రు. ఓపికతో పార్టీ నిర్ణయాలకు కట్టుబడి, ప్రజల సం క్షేమం కోసం పాటుపడాలని సూచించారు. పార్టీలో చేరి న వారిలో ఆంజనేయులు, శ్రీను, చెన్నయ్య, కుర్మ య్య, ఆంజనేయులు, నాగరాజు, పద్మ, సత్యం, శేఖర్, ఖాదరయ్య, తెలుగు లక్ష్మయ్య, నాగయ్యయాదవ్, రమేశ్, శ్రీనివాసులు, రాజు, వెంకటేశ్, శివ, రవి, రా మాంజనేయులు, శివశంకర్, వెంకటస్వామి, సంతోష్‌రాజు, కుర్మయ్య, బాల మాసన్న, శేఖర్‌తోపాటు మరో 250 మంది ఉన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, ఎంపీపీ సుధాశ్రీ, సర్పంచ్ కురువ శ్రీను, మార్కెట్ కమిటీ చైర్మన్ రహెమాన్, మల్లు నరసింహారెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.