మక్తల్ టౌన్, ఆగస్టు 17 : వైభవంగా లక్ష బిల్వార్చన కార్యక్రమం నిర్వహించామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మంగళవారం పట్టణంలోని ఆజాద్‌నగర్‌లో ఉమామహేశ్వరాలయం తొమ్మిదో వార్షికోత్సవం సందర్భం గా లక్ష బిల్వార్చన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అ ర్చకుడు సిద్ధిరామయ్య స్వామి ఆధ్వర్యంలో మహారుద్రాభిషేకం, కలశ స్థాపన, గణపతి పూజ, సుభ్రమణ్య స్వామి పూజ, నాగదేవతల పూజ, సకల దేవతల పూజ అత్యంత వైభవంగా చేపట్టారు. అనంతరం నిర్వహించిన లక్ష బిల్వార్చన కార్యక్రమంలో అనేకమంది భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తిశ్రద్ధలతో బిల్వ పత్రం సమర్పిస్తూ మొ క్కులు చెల్లించుకున్నారు. స్వామి వారికి మహా మంగళహారతి, తీర్థ ప్రసాదాలు, అనంతనం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీనివాసులు, సత్యనారాయణ, అనంతకుమార్, సూర్య, ఆంజనేయులు, కృ ష్ణయ్య, నరేందర్, నీలి శ్రీనివాసులు, నారాయణరెడ్డి, రా ములు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
పార్వతీశ్వరాలయంలో…
మండలంలోని ముక్తిపాడ్ గ్రామ శివారులోని పార్వతీశ్వరాలయంలో భక్తు లు ప్రత్యేక పూజలు నిర్వహించా రు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. ముందస్తుగా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో భక్తు లు ఎలాంటి ఇబ్బందులు లేకుం డా స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించా రు. ఆలయంలో రుద్రాభిషేకం, ఉమామహేశ్వర కల్యాణం నిర్వహించారు. అనంతరం భక్తులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ప్రత్యేక అలంకరణలో అమ్మవారు
మండలంలోని లోకపల్లిలో వెలిసిన లక్ష్మమ్మ అమ్మవారిని మంగళవారం ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. అమ్మవారికి అభిషేకం, స్వర్ణాలంకరణ, శాంతిహోమం చేశారు. వివి ధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదల వితరణ చేశారు.