మరికల్, ఏప్రిల్ 28 : బీజేపీ, కాంగ్రెస్ బట్టెబాజ్ పార్టీలని, వారికి ప్రజలే తగిన గు ణపాఠం చెబుతారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నా రు. గురువారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో లంబాడీ రాములు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నుంచి సుమారు 300 మంది టీఆర్ఎస్లో చేరారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు రాములు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ గౌని సురేఖారెడ్డి, ఎంపీపీ శ్రీకళ, ఎంపీటీసీలు సుజాత, గోపాల్, సర్పంచ్ కస్పే గోవర్ధన్, వైస్ ఎం పీపీ రవికుమార్, మండల కోఆప్షన్ సభ్యుడు మతీన్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు చంద్రశేఖర్, మండలాధ్యక్షుడు తిరుపతయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.