రెండేళ్లలో అధికారంలోకి బీఆర్ఎస్
రాష్ట్రం లో వచ్చే రెండేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన కార్పొరేటర్లు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ గెలుపొందిన కార్పొరేటర్లను అభినందించారు.
- ఎన్నికల్లో కార్పొరేటర్లు ఇచ్చిన హామీలను పూర్తిచేస్తాం..
- వచ్చే ప్రభుత్వంలో శ్రీనివాస్‌గౌడ్ మంచి హోదాలో ఉంటారు..
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు
మహబూబ్‌నగర్ అర్బన్, ఫిబ్రవరి 15 : రాష్ట్రం లో వచ్చే రెండేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన కార్పొరేటర్లు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ గెలుపొందిన కార్పొరేటర్లను అభినందించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని తాను రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న సమయంలో ఇదే విషయాన్ని ప్రజలు చెప్తున్నారని గుర్తు చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో మీ డివిజన్లో ఇచ్చిన హామీలను పూర్తి చేసేందుకు తప్పకుండా సహకరిస్తామన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజా సమస్యలపై పాలక పక్షాన్ని నిలదీయాలని సూచించారు. సిరిసిల్ల, సిద్దిపేటకు దీటుగా మహబూబ్‌నగర్‌ను మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభివృద్ధి చేశారు. మిగిలిపోయిన పనులను ప్రభుత్వం వచ్చిన వెంటనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ప్రభుత్వంలో మీ మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మంచి స్థానంలో ఉం టారు. మీ గెలుపు కోసం ఆయన అహర్నిశలు కృషి చేశారు. శ్రీనివాస్‌గౌడ్‌కు అండగా నిలబడాలన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో చాలా మంది కార్పొరేటర్లు తక్కువ ఓట్లతో ఓడిపోయారు. ఓడిన అభ్యర్థులకు భవిష్యత్‌లో మంచి స్థానం కల్పిస్తామని తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- corporators
- elections
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

