మూసాపేట(అడ్డాకుల), ఏప్రిల్ 26 : తెలంగాణ ఉ ద్యమంలో ఏ ఒక్క రోజు కనిపించని పార్టీల నాయకు లు నేడు రాష్ర్టాన్ని విచ్ఛిన్నం చేయడానికి పాదయాత్రల పేరుతో రాబంధుల్లా తిరుగుతున్నారని, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అంతా అవినీతి పరిపాలన కొనసాగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దుయ్యబట్టారు. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డితో కలిసి రైతు వేదికతోపాటు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా రైతువేదికలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యమంలో ఏ ఒక్కరోజు కనిపించని బీజేపీ నేత బండి సం జయ్ నేడు పాదయాత్రల పేరుతో ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడన్నారు.
గతంలో ఎన్నడూ లేనంతగా తెలంగాణలో పెద్ద మొత్తంలో పంటలు పం డుతున్నాయని, ధాన్యం సేకరణ తాము చేయలేమని కేంద్ర మంత్రులు చేతులు ఎత్తేస్తున్నారని చెప్పారు. తె లంగాణలో వ్యవసాయ బోరు మోటర్లకు మీటర్లు పెట్టకుంటే కేంద్రం నుంచి ఇవ్వాల్సిన సబ్సిడీ ఇవ్వమని కేం ద్రం చెప్పినా రైతులకు మేలుకోరి ముఖ్యమంత్రి కేసీఆ ర్ ఒప్పుకోలేదన్నారు. బండికి నిజమైన సేవాభావం ఉంటే తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను బీజేపీ పాలిత ప్రాంతాల్లో అమలు చేయించాలని చెప్పారు. మరోవైపు వైసీపీ పేరుతో షర్మిల తన అన్న ఆంధ్రప్రదేశ్‌లో ఏం చేయకపోయినా సరే.. అభివృద్ధి పథంలో దూ సుకుపోతున్న తెలంగాణలో ఏం చేయలేదని ఆరోపణ లు చేస్తుందన్నారు. మరోవైపు తెలంగాణ ఉద్యమ సమయంలో చంద్రబాబుతో జతకట్టి ఉద్యమాన్ని నీరుగార్చే పనులు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్‌రెడ్డి నే డు ఆయన కూడా పాదయాత్ర పేరుతో పర్యటిస్తున్నాడన్నారు. వీరంతా సమిష్టిగా ఉన్న ప్రజలను, రాష్ర్టాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు.
బీజే పీ పాలిత రాష్ట్రాల్లో అంతా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మం త్రులు అవినీతి పరిపాలన కొనసాగిస్తున్నారని, బీజేపీ అక్రమాలకు నిలయమని, అందుకు నిదర్శనం కర్ణాటక రాష్ట్రంలోని రాయిచూర్‌లో ఇటీవల రోడ్డుకెక్కిన కాం ట్రాక్టర్లే అన్నారు. దేశంలో ఆర్థికవేత్తలు తమ ఉద్యోగాలను వదిలి వెళ్తున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చెప్పా రు. పాదయాత్రలు చేస్తున్న సమయంలో బీజేపీ నాయకుడికి గుడి, మసీదు ఎక్కడ కనిపించినా సరే చిచ్చుపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని, వారి మాటలకు ప్ర జలు ఆవేశ పూరితంగా తీసుకోవద్దన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక అక్కసు గక్కుతున్నారన్నారు. ఇక్కడ అ భివృద్ధిని చూసి బీజేపీ నాయకులు కల్లల్లో కారం పోసుకుంటున్నారన్నారు.
ఒకప్పుడు మనం వలసలు వెళ్లేవా ళ్లం.. ఇప్పుడు మన ప్రాంతాలకే ఇతర ప్రాంతాల నుం చి వలసలు వస్తున్నారని చెప్పారు. ఎన్నడూ లేనివిధం గా ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తున్నాయన్నారు. పేద, మధ్య తరగతి వాళ్ల కోసం ప్రత్యేకించి ఏర్పాటు చేస్తున్న శిక్షణ కేంద్రాలను సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సాధించాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్‌పవార్, రైతుబంధు సమితి జి ల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, మదనాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలనారాయణ, జెడ్పీటీసీ రాజశేఖర్‌రెడ్డి, ఎంపీపీ నాగార్జునరెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు తిరుపతిరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ జితేందర్‌రెడ్డి, సర్పంచ్ మంజుల, ఎంపీటీసీ రంగన్నగౌడ్, కోఆప్షన్ సభ్యుడు ఖాజాగోరి, తాసిల్దార్ కిషన్, ఎంపీడీవో మంజుల పాల్గొన్నారు.