గులాబీ జెండాలు ఎగరవేయనున్న ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు
వనపర్తి, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలకు జి ల్లా ముస్తాబవుతున్నది. గ్రామాల్లో ఇప్పటికే కో లాహలం కనిపిస్తున్నది. హైదరాబాద్‌లో బుధవారం జరగనున్న ప్లీనరీకి తరలివెళ్లేందుకు మం డలస్థాయి నుంచి జిల్లా స్థాయి నేతలు, ప్రజాప్రతినిధులు సిద్ధం అవుతున్నారు. నేటితో టీఆర్ఎస్ పార్టీ 22వ వసంతంలోకి అడుగుపెడుతు న్న సందర్భంగా పండుగలా నిర్వహించాలని నాయకత్వం నిర్ణయించింది. ప్లీనరీతోపాటు ఊ రూరా పార్టీ జెండాలు ఎగరవేయన్నారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో పెద్దఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారు. గ్రామం యూనిట్‌గా టీఆర్ఎ స్ పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్త లు వేడుకల నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. మున్సిపాలిటీ పరిధిలో చై ర్మన్లు, లీడర్లు, నాయకులు, కౌన్సిలర్లు, నాయకుల ఆ ధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టనున్నారు.
ప్లీనరీకి పరిమిత సంఖ్యలో..
హైదరాబాద్‌లో జరిగే టీఆర్ఎస్ ప్లీనరీకి వనపర్తి జిల్లా నుంచి పరిమిత సంఖ్యలో తరలివెళ్లనున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ అధ్యక్షుడు, ఎంపీ, కార్పొరేషన్ ఛైర్మన్లు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరుకానున్నారు. ఆహ్వానం వచ్చిన వారికి పాసులు జారీ చేయనున్నారు. పాసులు లేని వారికి ప్రవేశం ఉండదు. ప్లీనరీకి హజరయ్యేందుకు గ్రామ స్థా యి నుంచి ఆసక్తి కనబరుస్తున్నారు. తక్కువ మందికే అనుమతి ఉండడంతో పాసులు రాని వ్యక్తులు ఇక్కడే ఉండి సంబురాలు జరుపుకోనున్నారు. ప్రభు త్వం అమలుపరుస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారులు కూడా కా ర్యకర్తలతో కలి సి సంబురాలు చేసుకోనున్నారు. పార్టీ ఆవిర్భా వ వేడుకలు టీఆర్ఎస్ శ్రే ణుల్లో నూతనోత్తేజాన్ని నింపనున్నాయి. జి ల్లా నుంచి సుమా రు 100 మంది ప్లీనరీకి హాజరు కానున్నారు.