అచ్చంపేట, ఏప్రిల్ 26 : అటవీ, వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా వేసవిలో తాగునీటికి ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే అటవీ ప్రాంతంలో అనుకూలంగా ఉండేలా అధికారులు 180 సాసర్ పిట్లు నిర్మించారు. ట్యాంకర్లతోపాటు, పలుచోట్ల సోలార్ పంపులతో సిబ్బంది వాటిలో నీటిని నింపుతున్నారు. వాటి కదలికలను గమనించేందుకు సాసర్పిట్లు, వాగులు, కుంటల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెంచారు.
రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతూనే ఉన్నది. దీంతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. అటవీ ప్రాంతంలో వాగులు, వంకలు ఎండిపోయాయి. వన్యప్రాణులు అల్లాడిపోతున్నాయి. తాగునీటి కోసం అటవీ పరిసర గ్రామాలకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటవీ ప్రాంతంలోనే వాటి దాహార్తి తీర్చేందుకు ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వన్యప్రాణులకు అనుకూలంగా ఉండే అటవీ ప్రాంతాల్లో అధికారులు దాదా పు 180 సాసర్పిట్లు ఏర్పాటు చేశారు. వాటిలో ట్యాంకర్ల ద్వా రా నీటిని నింపుతున్నారు. అంతేకాకుండా సమీప ప్రాంతాల్లో సహజ సిద్ధమైన నీటి వనరులు అందుబాటులో ఉండేలా చర్య లు తీసుకుంటున్నారు.
అవసరమైన చోట సోలార్పంపు సెంట్లు ఏర్పాటు చేశారు. గతంలో 30 సోలార్ పంపు సెట్లు ఉండగా.. ఈ ఏడాది అదనంగా ఆరు సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేశా రు. మద్దిమడుగు, అమ్రాబాద్, మన్ననూర్, చారగొండ రేంజ్ పరిధిలో ఆరు సోలార్ పంపుసెట్ల ద్వారా బోర్లు వేయించి నీటి వసతి కల్పించారు. వన్యప్రాణులకు అవసరమైన పచ్చికను పెం చడంతోపాటు నీటి వనరులైన కుంటలు ఎండిపోకుం డా చర్యలు తీసుకుంటున్నారు. వన్యప్రాణులు ఎక్కువగా పర్యటించే చోట సాసర్పిట్లు, సోలార్ బోర్లు ఏ ర్పాటు చేయించారు. వాగులు, కుంటలు ఎండిపోకుం డా ట్యాంకర్లు, సోలార్బోర్లు వేయించి నింపుతున్నా రు. శాఖాహార జంతువుల కోసం గడ్డిని పెంచుతున్నా రు.
అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టులో పులుల సం ఖ్య, మాంసాహార జంతువుల సంఖ్య పెరిగాయి. వన్యప్రాణులకు ఆహారం, నీటి కొరత లేకుండా ఉండేలా చర్య లు చేపడుతున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో జింకలు, దుప్పులు, అడవిపందులు, కుందేళ్లు ఇతర శాఖాహార జం తువులు భారీగానే ఉన్నాయి. అంతేకాకుండా సాసర్పిట్లు, వాగులు, కుంటల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెంచారు. ఇటీవల అడపాదడపా కురుస్తున్న వర్షాలకు అడవి చిగురిస్తున్నది. ఇదిలా ఉండగా, అటవీ ప్రాంతంలో మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. పరిసర గ్రామాల ప్రజల కు అధికారులు అవగాహన కల్పించారు.