మహబూబ్‌నగర్ టౌన్, ఏప్రిల్ 26 : మైనార్టీల సం క్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం జి ల్లా కేంద్రంలోని హెచ్‌బీ గార్డెన్లో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు దుస్తులను పంపిణీ చేశారు. అనంతరం ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో రూ. 2.65 కోట్లతో నూతన మినీ స్టేడియం నిర్మాణ పనుల కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి ఒక స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానం ఆధునీకరణతో పాటు ఇండోర్ స్టేడియం నిర్మిస్తున్నామన్నారు. మహబూబ్‌నగర్‌ను అ న్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రా వు, అడిషనల్ కలెక్టర్ తేజస్‌నందలాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్, ముడా చైర్మన్ వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్హ్రెమాన్, ఎంవీఎస్ ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్, డీవైఎస్వో శ్రీనివాస్, కౌన్సిలర్లు వనజ, రాణి, నర్సింహులు, నాయకులు పల్లెరవి, విఠల్‌రెడ్డి, రషీద్ పాల్గొన్నారు.
కష్టపడి ఉద్యోగాలు సాధించాలి
జడ్చర్లటౌన్, ఏప్రిల్ 26: ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి ఎస్సై,కానిస్టేబుల్ ఉద్యోగాలను సాధించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం జడ్చర్లలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో ఎస్సీ,ఎస్టీ అభివృద్ధి శాఖ, పోలీసు శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నిరుద్యోగ ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ శిబిరాన్ని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు. రెండు నెలల పాటు నిరుద్యోగ యువత పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించి కష్టపడితే ఉద్యోగం వస్తుందన్నారు. గత ఐదేండ్లలో రాష్ట్రంలో రెండు లక్షలకుపైగా ఉద్యోగాలు ఇచ్చామన్నారు.
ఉద్యోగాల్లో స్థానిక రిజర్వేషన్ 95శాతం ఇచ్చిన ఘనత తమదేనని చెప్పారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగం సాధించాలంటే పట్టుదల, క్రమశిక్షణ చాలా అవసరమన్నారు. నిరుద్యోగులు ప్రైవేటు కోచింగ్ కేంద్రాల్లో వేలాది రూపాయలు ఫీజులు చెల్లించలేరని, అలాంటి వారు ఉచిత శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్యే అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌ను అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, ఎస్పీ వెంకటేశ్వర్లు, అదనపు ఎస్పీ రాములు, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, వైస్ చైర్పర్సన్ సారిక పాల్గొన్నారు.