మక్తల్ రూరల్, ఏప్రిల్ 26 : ఎంతో అట్టహాసంగా బీజే పీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర మక్తల్‌లో అట్టర్ ప్లాప్ అయిందని, పొటాపోటీగా ప్లెక్సీలు పెట్టిన సంఖ్యకు తగినంత జనం సభకు రాలేదని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నర్సింహగౌడ్, టీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్ర తినిధి రాంలింగం, పట్టణ అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి విమ ర్శించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమాశంలో వా రు మాట్లాడుతూ పట్టణంలో సోమవారం నిర్వహించిన బీ జేపీ బహిరంగ సభలో మున్సిపల్ చైర్పర్సన్ పావని ఎమ్మె ల్యే చిట్టెంపై ఆరోపణలు చేయడం, ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరైన పద్ధతి కాదని తీవ్రంగా ఖండించారు. పట్టణం లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నార ని, కేంద్రం నుంచి వచ్చే నిధులను ఎమ్మెల్యే రాకుండా చేశారని చైర్పర్సన్ పావని ఆరోపణలు చేయడం తగదన్నారు.
ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకొని సీఎం కేసీఆర్‌తో మాట్లా డి మున్సిపాలిటీని తప్పకుండా అభివృద్ధి చేయాలని, పట్టుబట్టి చేయిస్తున్నారని, మున్సిపల్ చైర్పర్సన్ పావని ఈ స్థా నంలో ఉన్నారంటే అది రామన్న చొరవ వల్లనే వచ్చిందనే విషయాన్ని గుర్తించుకోవాలని నాయకులు చెప్పారు. చైర్పర్సన్ పావనిని టీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఎవరు చె ప్పారు..? రాకపోతే చంపుతామని బెదిరిస్తున్నారని అబద్దా లు మాట్లాడడం శోచనీయమని వారు విచారం వ్యక్తం చేశా రు. పార్టీలోకి రమ్మని చెప్పిన నాయకులు ఎవరు..? బయ ట పెట్టాలని..? లేదా..? చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
మిమ్ముల్ని ఎప్పుడు పార్టీలో చేరమని ఆహ్వానించలేద ని, పార్టీ కోసం, ప్రజల కోసం కష్టపడి పని చేసే వారిని మా త్రమే ఆహ్వానిస్తున్నామన్నారు. పనుల కోసం ఎమ్మెల్యే వద్ద కు వచ్చి పనులు చేయించుకున్న తర్వాత విమర్శించడం బీ జేపీ నాయకులకు అలవాటేనని వారు ఎద్దేవ చేశారు. ఎనిమిదేండ్ల బీజేపీ పాలనలో రాష్ర్టానికి ప్రధాన మంత్రి మోదీ ఒరగపెట్టింది ఏమిలేదని వారు ఆరోపించారు.
దేశవ్యాప్తం గా 35 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని, వాటిపై ఏనా డు మాట్లాడని బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై పనిగట్టుకొని విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇ టీవల సీఎం కేసీఆర్ 91 వేల ఉద్యోగాల ఖాళీల భర్తీ కోసం చర్యలు తీసుకుంటున్నారని, ప్రస్తుతం 16 వేల కానిస్టేబుల్ పో స్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ పావని భర్త రూ.40 లక్షలు, మరో బీజేపీ కౌన్సిలర్ రూ.20లక్షల పనులు చేయించారని, ఎమ్మెల్యే పనుల ను అడ్డుకుంటున్నారని ఆరోపించడం అంతర్యం ఏమిటి. .? ఎమ్మెల్యే అడ్డుపడితే అభివృద్ధి పనులు ఎలా చేశారని వారు ప్రశ్నించారు. జూరాల ప్రాజెక్టు, భీమా ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన చిట్టెం, భూత్పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల కింద కృష్ణానది పరివాహాక ప్రాంతంలో ప చ్చని పంట పొలాలు చూసి ఓర్వలేక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మక్తల్ మున్సిపాలిటీలో అభివృద్ధి జ రుగలేదని ఆరోపణలు చేయడం బీజేపీ నైరాశ్యానికి నిదర్శనమని వారు విమర్శించారు.
పరిస్థితి ఇలాగే ఉంటే కేంద్రంపై ప్రజలే తిరగపడే రోజు లు దగ్గరలోనే ఉన్నాయని వారు పేర్కొన్నారు. సమావేశం లో కౌన్సిలర్లు జగ్గలిరాములు, మొగులప్ప, నాయకులు త దితరులు పాల్గొన్నారు.