ఊట్కూర్, ఏప్రిల్ 26 : వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అ న్నారు. పులిమామిడి పీహెచ్సీలో ఆశ కార్యకర్తలకు మంగళవారం స్మార్ట్ఫోన్లను ఎమ్మెల్యే అందజేశారు. ప్రజల ఆరో గ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి పీహెచ్‌సీలకు అన్ని వసతులను సమకూర్చిందన్నారు. ఆశ కార్యకర్తలకు ప్రభు త్వం తగిన గుర్తింపును తెస్తూ వారికి జీతాలు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. పీహెచ్సీలో రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి ఎమ్మెల్యే ఆరా తీశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో రామ్‌మనోహర్‌రావు, జెడ్పీటీసీ అశోక్‌కుమార్‌గౌడ్, పీఏసీసీఎస్ చైర్మన్ బాల్‌రెడ్డి, సర్పంచ్ సూరయ్యగౌడ్, వైస్‌ఎంపీపీ ఎల్లాగౌడ్, పీహెచ్సీ వైద్యుడు నరేశ్చం ద్ర, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
విద్యుత్ సమస్యలు త్వరగా పరిష్కరించాలి
మక్తల్ టౌన్, ఏప్రిల్ 26 : కాట్రపల్లి గ్రామ పంచాయతీ భవనం పనులు త్వరగా పూర్తి చేయాలని, అంకెన్‌పల్లి, పారేవుల తదితర గ్రామాల్లో విద్యుత్ సమస్యలు త్వరగా పరిష్కరించాలని ఆయా శాఖలకు సంబంధించిన అధికారుల కు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఆ దేశించారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వనజ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యా రు. ఆయా సంబంధిత శాఖల వివరా లు అధికారులు నెల రోజుల్లో చేపట్టిన పనులు వివిధ గ్రామాల్లో అభివృద్ధి కా ర్యక్రమాలు వివరించారు. అదేవిధం గా విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారిని సర్పంచులు, ఎంపీటీసీలు పారేవుల, అంకెన్‌పల్లి, జక్లేర్ గ్రామాల్లో విద్యు త్ సమస్యలు పరిష్కరించడం లేదని అధికారులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ గ్రా మాల్లో పెండింగ్‌లో ఉన్న విద్యుత్ సమస్యలను త్వరగా పూ ర్తి చేయాలని అధికారులకు సూచించారు.
కాట్రపల్లిలో ఏ డేండ్లవుతున్న భవనం పూర్తి చేయకపోవడంపై అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు.సంబంధిత కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇచ్చి గ్రామ పం చాయతీ నిధులతో భవనం త్వరగా పూర్తి చేయాలని సర్పం చ్, కార్యదర్శికి సూచించారు. ప్రతి కార్యదర్శి సర్వసభ్య స మావేశానికి హాజరుకావాలని ఎంపీడీవోకు సూచించారు. ఇరిగేషన్ ఏఈ రాజేశ్ తెలుపుతూ ఇరిగేషన్ స్థలాన్ని కాపాడమని ఎమ్మెల్యే కోరగా ఎంఆర్వోకు భూమికి సంబంధిం చిన వివరాలు నోటీసులు ఇవ్వాలని, ఇరిగేషన్ స్థలాన్ని ఆ క్రమణకు గురికాకుండా చూస్తామని తెలిపారు. ఖానాపూర్ కెనాల్ వద్ద ఏర్పడిన గండిని త్వరగా పూడ్చండి, తవ్విన వారిపై కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించా రు. అదేవిధంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా నానాజీ దేష్ముఖ్ గౌరవ గ్రామసభ పురస్కా ర్ అవార్డు పొందిన మంథన్ గోడ్ సర్పంచ్ మహాదేవమ్మ ను ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీ ధర్, తాసిల్దార్ రాణా ప్రతాప్ సింగ్, ఎంఈవో లక్ష్మీనారాయణ, ఎంపీటీసీలు బల్రాంరెడ్డి, రవీందర్, ఏవో మిథున్, హార్టికల్చర్ అధికారి సమీనా, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.