వనపర్తి, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ)/ఖిల్లాఘణపురం : జిల్లాకు ఎత్తిపోతల పథకం మంజూరైంది. ఖిలాఘణపురం మండలంలో కర్నెతండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో జి ల్లాకు పూర్తిస్థాయిలో సాగునీరందనున్నది. రూ.76.19 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. సీఎం కేసీఆర్ సహకారంతో ఐదేండ్ల కిందట ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడి పదవిలో ఉన్న నాటి మంత్రి నిరంజన్‌రెడ్డి పెద్దమందడి, ఖిల్లాఘణపురం బ్రాంచ్కెనాల్ను పూర్తిచేసి దాదాపు అన్ని గ్రామాలను ఎంజీకేఎల్ఐ ద్వారా సాగునీరు అందించారు. ఒకవైపు పెద్దమందడి బ్రాంచ్ కెనాల్.. మరోవైపు ఘణపురం బ్రాంచ్ కెనాల్ ఉన్నా.. ఎత్తయిన ప్రాంతాల్లో ఉన్న తండాలకు సా గునీరందడం లేదు.
ఈ క్రమంలో ఎత్తయిన ప్రాం తాలకు ఎలాగైనా సాగునీరందించాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌కు మంత్రి నిరంజన్‌రెడ్డి వినతులు అందజేశారు. స్పందించిన సీఎం కేసీఆర్ కర్నెతండా ఎత్తిపోతలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతోపాటు రూ.76.19 కోట్లు మం జూరు చేశారు. ఎంజీకేఎల్ఐ నీటిని ఎత్తిపోసేలా కర్నెతండా లిప్ట్ నిర్మించనున్నారు. పనులు పూర్తయితే కర్నెతండా, దొంటికుంటతండా, గార్లబండతండా, పా మిరెడ్డిపల్లి తండా, భీమునితండా, జంగమాయిపల్లి, రు క్కన్నపల్లి, ఆముదంబండతండా, ముందరితండా, షా పూర్, మానాజిపేట, సోలీపూర్, బలిజపల్లి, పామిరెడ్డిపల్లి గ్రామాలు లబ్ధి పొందనున్నాయి. 4,235 ఎకరాల కు సాగునీరందనున్నది. దీంతో గ్రామాలు, తండా ప్ర జలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు..
కర్నెతండా ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు. తెలంగాణ రాకతో సాగునీటి ముఖచిత్రం మారిపోయింది. ఏడేండ్లలో వనపర్తి నియోజకవర్గం సస్యశ్యామలమైంది. ఐదేండ్ల కిందట సాగు, తాగు నీటికి ఇబ్బందులు ఉండేవి. సీఎం కేసీఆర్‌కు పరిస్థితి వివరించి పూర్తిస్థాయిలో ప్రాజెక్టులు చేపట్టాం.