నవాబ్‌పేట, ఆగస్టు 11 : గ్రామాల సర్వతోముఖాభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని మాజీ మంత్రి, జ డ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సీ.లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని ఫత్తేపూర్ మైసమ్మ దేవాలయం, సిద్దోటం, తీగల్‌పల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మొదట ఫత్తేపూ ర్ మైసమ్మ ఆలయం చుట్టూ రూ.8 లక్షల సొంత నిధులతో మాజీ జెడ్పీటీసీ ఇందిరాదేవి చేపట్టనున్న క్యూ లైన్, దర్శనం లైన్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. సిద్దోటంలో నూతనంగా ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనం, సెగ్రిగేషన్ షెడ్, శ్మశాన వాటిక పనులకు, తీగల్పల్లిలో గ్రామ ముఖద్వారం, నూతన హనుమాన్ ఆల య నిర్మాణానికి భూమిపూజ, శ్మశాన వాటికకు ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్భంగా తీగల్పల్లిలో ఏ ర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దళితబంధు పథకం అమలుతో వారి జీవితాల్లో కొత్త అధ్యాయం ప్రారంభం కానున్నదన్నారు. హుజూరాబా ద్ ఎన్నికల కోసమే దళితబంధు అమలు చేస్తున్నారన్న ప్రతిపక్ష నాయకులు మా టలు అర్ధరహితమన్నారు. కాంగ్రెస్, బీజే పీ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో మన పథకాలు ఎందుకు అమలు చేయ డం లేదని ఆయన ప్రశ్నించారు. త్వరలో నే కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. త్వరలోనే 50 వేలలోపు పంట రుణాలన్నీ ఏకకాలంలో మాఫీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ నర్సింహులు, తాసిల్దార్ రాజేందర్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీలత, వైస్ ఎంపీపీ సంతోష్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ డీఎన్ రావు, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఇందిరాదేవి, మాజీ ఎంపీపీ శీనయ్య, సర్పంచులు జంగమ్మ, వసుంధర, జంగయ్య, గోపాల్‌గౌడ్, యాదయ్య, ఎంపీటీసీ రాజ్‌కుమార్, మండల కోఆప్షన్ సభ్యుడు తాహెర్, మైసమ్మ దేవాలయ కమిటీ చైర్మన్ పాశం గోపాల్, నాయకులు నాగిరెడ్డి, నారాయణ, బాలకిష్టయ్య, పాశం కృష్ణయ్య, బాలయ్య, నర్సింహులు, వెంకటేశ్, రవి, కృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.