నాగర్‌కర్నూల్, ఆగస్టు 11: ఆరుగాలం కష్టించి పం డించే పంటలపై రైతుకు అవగాహన పెంచేందుకు ప్రతి గ్రా మ పంచాయతీలోనూ రైతు వేదికలు నిర్మిస్తున్నట్లు ఎమ్మె ల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, జెడ్పీ చైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతి అన్నారు. రైతు సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా మిగిలారని పేర్కొన్నారు. బుధవారం మండలంలోని గుడిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతువేదిక, వై కుంఠ ధామాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ దేశం లో ఎక్కడా లేని విధంగా 24 గంటల కరెంటును తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్నదన్నారు. 60 ఏండ్లలో రైతు వేదికలు నిర్మించి అవగాహన కల్పించాలనే ఆలోచన ఏ ఒక్క నాయకుడికి రాకపోవడం దురదృష్టకరమన్నారు.
కొ ట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం వ్యవసాయ రం గంలో బలంగా ఉండాలనే ఉద్దేశంతో పెద్ద ఎ త్తున రైతువేదికలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. సాగులో కొత్త పద్ధతులు, సరికొత్త వ్యవసాయ విధానంపై పూర్తిగా రైతులకు అవగాహన పెంచేందుకు ఈ వేదికలు ఎంతో ఉపయోగపడుతాయని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయం లాభసాటిగా ఉండేలా సీఎం చర్యలు తీసుకుంటున్నారన్నారు. కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు డబ్బు లు అందజేయడం మన ప్రభుత్వానికే సాధ్యమైందన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ సిబ్బందిని సన్మానించారు. రైతు వేదిక ఆవరణలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. గుడిపల్లి మాజీ సర్పంచ్ నర్సింహారెడ్డి రచించిన ‘నెగడు’ పుస్తకాన్ని వారు ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మనూచౌదరి, సర్పంచ్ అయిలమ్మ, జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు, విండో చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీటీసీ శ్రీశైలం, మార్కెట్ కమిటీ చైర్మన్ ఈశ్వర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.