మక్తల్ టౌన్, ఆగస్టు 11 : సాగునీటికి ఆటంకం కలుగకుండా చూడాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలో ని ఖానాపూర్ పంప్ హౌస్ స్టేజ్ 2 వద్ద మెయిన్ కెనాల్‌కు గండి పడడంతో ఎమ్మెల్యే హుటాహుటిన వెళ్లి పరిశీలించా రు. పనులు త్వరగా చేపట్టాలని అధికారులను ఆదేశించా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధిక వర్షాల కారణంగా నీరు కాల్వ లోకి రావడంతో గండ్లు పడుతున్నాయని పేర్కొన్నారు. వారం రోజుల నుంచి పంటలకు సాగునీరు త్వరగా అందించాలని, రైతులకు ఇబ్బంది కలుగకుండా కాల్వకు పడిన గండ్లను పూడ్చామన్నారు. రైతులకు ఇబ్బంది కలుగకుం డా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి గడపలో సీఎం కేసీఆర్
తెలంగాణ ప్రతి గడపలో సీఎం కేసీఆర్ కొలువై ఉన్నారని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని టేకులపల్లిలో తెలంగాణ రాష్ట్ర స మితి జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ గొప్ప విజన్ కలిగిన వ్యక్తి అని, తెలంగాణను అభివృద్ధి పథంలో పరిగెత్తిస్తున్నారని పే ర్కొన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న దళిత బంధు పథకం దళిత సమాజం స్వాగతిస్తూ గుండెల నిండా మురుసిపోతున్నారన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రా మంలో సాగు, తాగునీరు లోటు లేకుండా అన్ని విధాల అభివృద్ధి చేసి చూపించామ న్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు అందుతున్నదన్నారు. ఇంకా కొ న్ని చోట్ల పనులు కొనసాగుతున్నాయన్నా రు. త్వరలో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతామన్మారు. కార్యక్రమంలో మార్కె ట్ కమిటీ చైర్మన్ రాజేశ్‌గౌడ్, ఎంపీపీ వన జ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరిస్తాం
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం లో నూతనంగా ఏర్పడిన మక్తల్ ప్రెస్ క్లబ్ కమిటీని అభినందించారు. మండల అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతప్రసాద్ను ఎమ్మెల్యే సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు ప్రభుత్వం తరఫున కావాల్సిన సదుపాయాలు నెరవేర్చేందుకు కృషి చేస్తామని పేర్కొన్నా రు. జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పని చేయాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలిసే విధంగా జర్నలిస్టులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన రాజేశ్‌గౌడ్, గౌరవ అధ్యక్షుడు సురేందర్, సలహాదారులు అంజన్ ప్రసాద్, బాలరాజు, కార్యదర్శి శంకర్‌కుమార్, ప్రధాన కా ర్యదర్శులు, ఉపాధ్యక్షులు, కోశాధికారులు, కార్యవర్గ స భ్యులు తదితరులు పాల్గొన్నారు.