భూత్పూర్, ఏప్రిల్ 16 : గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలకు రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకురావాలని తాసిల్దార్ చెన్నకిష్టన్న కోరారు. మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన అవగాహన కా ర్యక్రమంలో మాట్లాడారు. యాసంగి వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. ధాన్యంలో తేమ 17శాతంలోపు ఉండాలని, మట్టిపెడ్డలు, తాలు లేకుండా జాగ్రత్త లు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధా న్యానికి రూ.1960, బీ గ్రేడ్ ధాన్యానికి రూ.1940 చెల్లిస్తుందని పేర్కొన్నారు. ధాన్యం నాణ్యత విషయంలో సిం గిల్‌విండో, ఐకేపీ సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, ఎంపీడీవో మున్ని, సింగిల్‌విండో చైర్మన్ అశోక్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ నరేశ్‌గౌడ్, ఏవో మురళీధర్, ఏపీఎం హైమావతి, సీఈవో రత్నయ్య పాల్గొన్నారు.
అన్ని గ్రామాల్లో ధాన్యం సేకరించాలి
మండలంలోని అన్ని గ్రామాల్లో ధాన్యం సేకరించాలని ఎంపీపీ దోనూరు నాగార్జునరెడ్డి సూచించారు. మండల రెవెన్యూ కార్యాలయంలో ధాన్యం కొనుగోలుపై తాసిల్దార్ కిషన్ ఆధ్వర్యం లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రతలు, పాటించాల్సిన పద్ధతులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మంజుల, ఏవో శ్రీనివాసులు, సిం గిల్‌విండో చైర్మన్ జితేందర్‌రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు బొక్కలపల్లి తిరుపతిరెడ్డి, ఏపీఎం సుదీర్ పాల్గొన్నారు.