ఊట్కూర్, ఆగస్టు 11 : గ్రామాభివృద్ధికి ప్రతిఒక్కరూ సహకరించాలని సర్పంచ్ సూర్యప్రకాశ్‌రెడ్డి కోరారు. బుధవారం మండలకేంద్రంలో గ్రామసభ నిర్వహించారు. గ్రా మంలో వార్డుల వారీగా చేపట్టిన అభివృద్ధి పనులను స ర్పంచ్ వినిపించారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలను పం చాయతీ సభ్యులు సర్పంచ్ దృష్టికి తెచ్చారు. గ్రామంలో సీసీ రోడ్లు, సైడ్ కాల్వల నిర్మాణ పనులపై పాలకవర్గ సభ్యు లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీ సీ హన్మంతు, ఉపసర్పంచ్ ఇబాదుల్ రహిమాన్, పంచాయతీ కార్యదర్శి జాన్, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచ ర్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే మండలంలోని మల్లేపల్లిలో సర్పంచ్ మాణిక్యమ్మ, బిజ్వారంలో స ర్పంచ్ సావిత్రమ్మ అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించి అభివృద్ధి పనులపై తీర్మానం చేశారు.
సమస్యల పరిష్కారం కోసమే గ్రామసభ
మరికల్, ఆగస్టు 11 : గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసమే గ్రామసభను నిర్వహించినట్లు సర్పం చ్ గోవర్ధన్ అన్నారు. మండలకేంద్రంలోని పంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ ని ర్వహించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను వార్డు సభ్యులు ప్రస్తావించారు. వాటిని పరిష్కరిస్తామని స ర్పంచ్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రవికుమార్, ఎంపీవో బాలాజీ, వార్డు సభ్యులు, గ్రామస్తు లు తదితరులు పాల్గొన్నారు.
ఆమోదం ప్రకారం నిర్మాణాలు చేపట్టాలి
ధన్వాడ, ఆగస్టు 11 : ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పం చాయతీ ఆమోదంతో ఇంటి నిర్మాణాలు చేపట్టాలని సర్పం చ్ అమరేందర్‌రెడ్డి కోరారు. బుధవారం మండలకేంద్రంలోని పంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. సమావేశంలో పలు అం శాలపై చర్చించారు.
పంచాయతీ ఆమోదం ప్రకారం భవన నిర్మాణాలు చేపట్టాలని, సజ్జలు, అరుగులు, మరుగుదొడ్లు, నల్లా కనెక్షన్, కాంపౌండ్ వాల్ నిర్మించుకోవాలన్నారు. ఇంటి నిర్మాణానికి ఐదు ఫీట్లు షాపింగ్ కాంప్లెక్స్‌కు, పది ఫీట్లు స్టేట్ బ్యాం క్ రోడ్డు దిశకు స్థలం విడిచి నిర్మాణాలు చేపట్టాలని గ్రామసభలో తీర్మానించారు. ఇంటి నిర్మాణాలు చేపట్టేటప్పడు క చ్చితంగా ఇంకుడుగుంత నిర్మించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి పుష్పలత, గ్రామస్తులు పాల్గొన్నారు.