జెడ్పీటీసీ అశోక్‌కుమార్‌గౌడ్
సీసీ రోడ్డు పనులు ప్రారంభం
ఊట్కూర్, మార్చి 20 : గ్రామ సీమల అభివృద్ధే ప్రభు త్వ ధ్యేయమని జెడ్పీటీసీ అశోక్‌కుమార్‌గౌడ్ అన్నారు. మండలంలోని పగిడిమర్రిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆదివారం భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనులు టీఆర్ఎస్ హయాంలోనే జరుగుతున్నట్లు పేర్కొన్నారు. మండలంలో ని ప్రతి గ్రామానికీ బీటీ రోడ్డు సౌకర్యం కల్పించిన ఘనత ఎమ్మెల్మే చిట్టెం రామ్మోహన్‌రెడ్డికే దక్కిందన్నారు. జీపీ ని ధులు రూ.5 లక్షలతో పనులను ప్రారంభించినట్లు సర్పంచ్ సులోచన తెలిపారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్ చైర్మన్ బాల్‌రెడ్డి, మాజీ విండో చైర్మన్ నారాయణరెడ్డి, ఎంపీటీసీ షహనాజ్‌బేగం, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లక్ష్మారెడ్డి, మురళీధర్‌రెడ్డి, నారాయణగౌడ్, విష్ణుమూర్తిగౌడ్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లిలో…
మాగనూర్, మార్చి 20 : గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారని జెడ్పీటీసీ వెంకటయ్య అన్నారు. మండలంలోని కొత్తపల్లిలో సీసీ రోడ్డు పనులకు ఆదివారం భూమి పూజ చేసి సర్పంచ్ తిమ్మప్ప, సింగిల్‌విండో చైర్మన్ వెంకట్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. జాతీయ ఉపాధి హామీ నిధులు రూ.10లక్షలతో 3వ వార్డులో సీసీరోడ్డు పనులను ఆరంభించా రు. కార్యక్రమంలో ఎంపీపీ శ్యామలమ్మ, ఉపసర్పం చ్ అంజమ్మ, ఎంపీటీసీ లక్ష్మమ్మ, టీఆర్ఎస్ మండ ల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, నాయకులు, గ్రామస్తు లు తదితరులు పాల్గొన్నారు.
శేర్నపల్లిలో…
నారాయణపేట రూరల్, మార్చి 20 : మండలంలోని శేర్నపల్లిలో ఎన్ఆర్ఈజీఎస్ నుంచి మంజూరైన సీసీ రోడ్డు నిర్మాణ పనులను పీఏసీసీఎస్ చైర్మన్ డాక్టర్ నర్సింహారెడ్డి, సర్పంచ్ దేవీబాయ్ ఆదివారం భూమి పూజ చేసి ప్రారంభించారు. కమ్మరి వెంకట ప్ప ఇంటి నుంచి నర్సింగప్ప ఇంటి వరకు, పాఠశాల నుంచి వాటర్ ట్యాంకు వరకు, తిమ్మప్ప ఇంటి నుంచి చెన్న ప్ప ఇంటి వరకు, తిమ్మప్ప ఆలయం నుంచి మోహన్‌రెడ్డి ఇంటి వరకు రోడ్లు వేయనున్నారు. కార్యక్రమంలో ఏఈ కార్తీక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాములు, నాయకు లు రాములు, గుండప్ప, మోహన్‌రెడ్డి, రాంచందర్, హ న్మంతు, నరేందర్, కాళప్ప పాల్గొన్నారు.
గురుజాలలో…
కృష్ణ, మార్చి 20 : మండలంలోని గురుజాలలో ఆదివారం ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.15లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు జెడ్పీటీసీ అంజనమ్మపాటిల్, ఎంపీపీపీ పూర్ణిమపాటిల్ హాజరై సర్పంచ్ దేవేంద్రప్పతో కలిసి భూ మి పూజ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విజయ్‌పాటిల్, సర్పంచుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శివప్ప, ఎంపీడీవో శ్రీనివాసులు, మం డల నాయకుడు శివరాజ్‌పాటిల్, కార్యదర్శి ఆంజనేయు లు, టీఆర్ఎస్ గ్రామ నాయకులు పాల్గొన్నారు.