ఇకపై రహదారులకు సొబగులు
ఎన్ఆర్ఈజీఎస్ నుంచి నిధుల కేటాయింపు
మండలానికి రూ.కోటి 25 లక్షలు మంజూరు
హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
ధన్వాడ, మార్చి 20 : అభివృద్ధే పరమావధిగా పనిచేస్తూ నియోజకవర్గంలో ప్రతి మండలానికి నిధులు తేవడంలో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ఎప్పుడూ ముందుంటారనే టీఆర్ఎస్ నాయకులు, ప్రజల మాటలను నిజం చేశారు. ప్రతి గ్రామానికీ అడిగిందే తడవుగా ఏవిధంగానైనా నిధులు మంజూరు చేయడంలో ఎమ్మెల్యేకు సాటిరారని నిరూపించుకుంటున్నారు. ఇప్పటి వరకు మండలంలో అనేక అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగానే మళ్లీ ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు నిర్మాణానికి పెద్దఎత్తున నిధులు మంజూరు చేయించారు. ఎన్ఆర్ఈజీఎస్ నుంచి మండలానికి రూ.కోటి25 లక్షలు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే సహకారంతోనే మండలంలోని ప్రతి గ్రామానికీ సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మం జూరు చేయడం జరిగిందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధికి మారుపేరుగా ఎమ్మెల్యే ఎప్పటికీ నిలిచిపోతారని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నిధులు మంజూరు ఇలా…
గ్రామాల వారీగా కొండ్రోన్పల్లికి రూ.5లక్షలు, గోటూర్‌కు రూ.15 లక్షలు, బుడ్డమర్రితండాకు రూ.5లక్షలు, కొండాపూర్‌కు రూ.10 లక్షలు, చర్లపల్లికి రూ.5లక్షలు, చీకర్లగడ్డతండాకు రూ.5లక్షలు, తోళ్లగుట్టతండాకు రూ.5 లక్షలు, దుడుగుతండాకు రూ.4లక్షలు, హన్మన్పల్లికి రూ.12 ల క్షలు, కిష్టాపూర్‌కు రూ.20 లక్షలు, ఎంనోన్పల్లికి రూ.9లక్ష లు, గున్ముక్లకు రూ.5 లక్షలు, చీరల నర్సయ్యతండాకు రూ.2.50 లక్షలు మంజూరు చేయడం జరిగింది. ప్రస్తుతం పనులను గ్రామాల వారీగా ప్రారంభించడంలో అధికారులు సైతం నిమగ్నమయ్యారు.నిధులతో త్వరలోనే పనులు ప్రారంభిస్తామని అధికారు లు తెలిపారు.
అభివృద్ధి ప్రదాతగా నిలిచిపోయారు…
గ్రామాలను అభివృద్ధి చేయడానికి ఎమ్మె ల్యే రాజేందర్‌రెడ్డి నిధులు మంజూరు చేయిస్తున్నారు. ప్రస్తుతం మండలంలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.కోటి 25లక్షలు మంజూరు చేయించడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణాలతో మట్టి రోడ్లు ఉండవు. అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉంది.
–సునీల్‌రెడ్డి, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు, కిష్టాపూర్