మూసాపేట(అడ్డాకుల), మార్చి 20 : టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరుతున్నదని ఎంపీపీ దోనూరు నాగార్జునరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి అడ్డాకుల మండలం రాచాలకు చెం దిన సంజన్న కూతురు అక్షితకు రూ.60వే లు, బుచ్చన్నకు రూ.60వేలు మంజూరయ్యాయి. ఆదివారం ఎంపీపీ వారింటికి వెళ్లి సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదలకు ప్రభుత్వం అండగా నిలిచి ఆపత్కాలంలో ఆదుకుంటున్నదని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీ నివాస్‌రెడ్డి, నాయకులు చక్రపాణిరెడ్డి, గంగిరెడ్డి, రాజుగౌడ్, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు
దేవరకద్ర రూరల్, మార్చి 20 : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి అన్నారు. దేవరకద్రకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు వర్కుటి కొండారెడ్డికి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.60వేల చెక్కును ఆదివారం అందజేశా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కృషితో కొండారెడ్డి వైద్యఖర్చుల నిమిత్తం సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.60వేలు మంజూరయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్‌యాదవ్, కొండా శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, దొబ్బలి ఆంజనేయులు, శ్రీనివాస్‌రెడ్డి, బాలరాజు, చల్మారెడ్డి, యుగంధర్‌రెడ్డి, రా మకృష్ణారెడ్డి, అంబేద్కర్ పాల్గొన్నారు.