జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి
జడ్చర్ల, మార్చి 20 : జడ్చర్లకు త్వరలోనే ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌తో పాటు రూరల్ పీఎస్ మంజూరు కానున్నట్లు, ఇందుకు సబంధించిన ఫైల్ ప్రభుత్వం వద్ద ఉన్నదని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. ఆదివారం జడ్చర్లలోని మసీద్ ఎదుట ఉన్న స్థలంలో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు సంబంధించి రెండు గదుల నిర్మాణానికి డీఎస్పీ కిషన్‌తో కలసి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్య తీవ్రతరం అవుతున్నదని తెలిపారు. ఈ ఇబ్బందులను తొలగించేందుకే ఎస్పీని కలసి ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. అందుకు ఎస్సైతోపాటు 8 మంది సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వీరు ఉండేందుకు తాత్కాలికంగా రెండు గదులను నిర్మిస్తున్నట్లు తెలిపారు. జడ్చర్ల సిగ్నల్‌గడ్డ వద్ద రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన డిజైన్ మార్చడంతో బ్రిడ్జినిర్మాణ పనుల్లో ఆలస్యం అవుతున్నట్లు చెప్పారు.
త్వరలోనే డిజైన్‌ను మార్చి బ్రిడ్జి నిర్మాణం చేపడుతామన్నారు. అయితే పనుల్లో కొంత ఆలస్యమైతే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని దుయ్యబట్టారు. అంతకు ముందు గౌడ ఫంక్షన్ హాల్ సమీపంలో రైల్వే బ్రిడ్జి వద్ద నిర్మిస్తున్న సీసీ రోడ్డును ఆయన పరిశీలించారు. హౌసింగ్‌బోర్డు కాలనీలో అనంత ట్రేడర్స్‌ను ప్రారంభించి విజయనగర్ కాలనీలో సాయిబాబా గుడి నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ముందుగా ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న సీఎల్ఆర్ క్రికెట్ పోటీలను పరిశీలించారు. క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. కార్యక్రమాల్లో డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్మన్ దోరేపల్లి లక్ష్మీ, పీఏసీసీఎస్ అధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రఘుపతిరెడ్డి, కోట్ల ప్రశాంత్‌రెడ్డి, ఉమాశంకర్‌గౌడ్, మాలిక్‌షాకీర్, బృందం గోపాల్, ఇంతియాజ్, బీకేఆర్, కిరణ్, రామ్మోహన్, నాగిరెడ్డి, దోనూర్ శ్రీనివాస్‌రెడ్డి, ఇర్షాన్, జంగయ్య, కౌన్సిలర్లు, రాజు, జ్యోతికృష్ణారెడ్డి, సారిక, లత, రమేశ్ పాల్గొన్నారు.