అభివృద్ధికి ఆకర్షితులై టీఆర్ఎస్లోకి..
కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి
కొల్లాపూర్, మార్చి 20 : రాష్ట్రంలోని ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. మున్సిపాలిటీలోని 15వ వార్డు చౌటబట్ల గ్రామానికి చెందిన కౌన్సిలర్ పోడేండ్ల సత్యంయాదవ్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు శివయాదవ్ ఆధ్వర్యంలో ఆల్ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ మురకొండ నర్సింహ, మాజీ వార్డు సభ్యులు మురకొండ వెంకటేశ్వర్లుతోపాటు మురకొండ బాలకృష్ణ, కోళ్ల పెద్దరాముడు, కోళ్ల ఈదమ్ముడు, కావలి ఆంజనేయులు, తడకలి కృష్ణయ్య, లింగం యాదవ్, కోళ్ల చిన్నరాముడు, రవి, రాము, హరీశ్, కోళ్ల మహేశ్, కోళ్ల రాము, లింగం తదితరులు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఆదివారం హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే బీరం చేస్తున్న అభివృద్ధిని చూసే తాము గులాబీ పార్టీలో చేరుతున్నట్లు పలువురు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్తోనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ హయాంలో అభివృద్ధిలో రాష్ట్రం దూసుకెళ్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో పట్టణ మాజీ ఉపసర్పంచ్ చంద్రశేఖరాచారి పాల్గొన్నారు.