లింగాల, మార్చి 20: పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని అవుసలికుంట గ్రామానికి చెందిన కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగులయ్య సోమవారం రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకోనున్నారు. గత జనవరి నెలలో మొగులయ్య పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన విషయం విధితమే. ఈమేరకు అవార్డు అందుకోవడానికి ఆదివారం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.