రూ.42 కోట్లతో దేశవ్యాప్తంగా సామాజిక సేవ
కరోనా కాలంలో రూ.5 కోట్ల ఆర్థిక సాయం
ప్రవాస భారతీయ వైశ్య సంస్థ అధ్యక్షుడు హరిరాయిని
31 కుటుంబాలకు కుట్టుమిషన్లు అందజేత
అచ్చంపేట, మార్చి 12 : సేవాగుణంలో వైశ్యులు సమాజానికి వెన్నెముక లాంటివారని ప్రవాస భారతీ య వైశ్య సంస్థ అధ్యక్షుడు హరిరాయిని అన్నారు. ఎన్ఆర్ఐ వాసవీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అచ్చంపేట మాజీ సర్పంచ్ గార్లపాటి ఇందిరమ్మ సుదర్శన్‌ల సూచ న మేరకు ఆదివారం పట్టణంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా సమయంలో అచ్చంపేట ప్రాంతంలో తీవ్రంగా నష్టపోయి ఇబ్బందులు పడుతున్న పేదలకు ఉపాధి కల్పించేందుకుగానూ 31 మందికి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరిరాయిని మాట్లాడుతూ అచ్చంపేటకు చెందిన మాజీ సర్పంచ్ గార్లపాటి సుదర్శన్ కుమారుడు గార్లపాటి ఆనంద్ పదిహేనేళ్ల కిందట కొందరితో కలిసి రూ.2 కోట్లతో సంస్థను స్థాపించారన్నారు. నేడు వటవృక్షంలా మారి 20 వేల మందితో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా అవతరించిందన్నారు. దేశవ్యాప్తంగా 34 సామాజిక కార్యక్రమాల రూపకల్పనతో సేవలు అందిస్తున్న ఎన్ఆర్ఐ చరిత్రలోనే మొదటిగా పేరొందిందన్నారు. సమాజంలో అట్టడుగున ఉన్న పేదలకు తమవంతు చేయూతనిస్తున్నట్లు చెప్పారు.
దేశవ్యాప్తంగా విస్తృతంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అండగా నిలబడుతున్నామని తెలిపారు. కరోనా కాలం లో ఆర్థికంగా చితికిపోయిన, చనిపోయిన కుటుంబాలకుగానూ వివిధ రాష్ర్టాల్లో రూ.5 కోట్ల నిధులను ఆర్థిక సాయం కోసం పంపించామని పేర్కొన్నారు. ఆర్థిక ఇ బ్బందులున్న 500 మంది మెడిసిన్, ఇంజినీరింగ్, ఉ న్నత విద్య అభ్యసించేందుకు వైశ్య విద్యార్థులకు అం డగా నిలబడ్డామన్నారు. అన్ని వర్గాల వారికి చేయూతనిస్తామన్నారు. 37 మంది ప్రవాస భారతీయ వైశ్యుల సహకారంతో రూ.42 కోట్ల నిధి జమ చేశామన్నారు. సంస్థ చైర్మన్ డాక్టర్ జయసింహ సుంకు మాట్లాడుతూ 300 మంది సభ్యులు అహర్నిశలు సమాజం కోసం సే వ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని కొనియాడా రు. మనిషి ఉన్నదాంట్లో సేవ చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం ఎన్‌ఆర్‌ఐవీఏ ప్రతినిధులను స్థానిక వైశ్యనేతలు సత్కరించారు. అంతకుముందు కోలాటాల ప్రదర్శనతో స్వాగతం పలికారు. సమావేశంలో సంస్థ కోశాధికారి దినకర్ కారుమూరి, మాజీ సర్పంచులు ఇందిరమ్మ, సుదర్శన్, కౌన్సిలర్ శ్రీనివాసులు, రవి, ఆలయ అధ్యక్షుడు బంధంరాజు, మహిళలు, ఆయా సంఘాల వైశ్యనేతలు సత్యనారాయ ణ, వెంకటరమణ, సౌజన్య, సంధ్య, సత్యనారాయణ, కర్ణస్వామి, విజయ్‌కుమార్, నర్సింహారావు, వినోద్, నరేశ్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.