కలెక్టర్ హరిచందన
నారాయణపేట టౌన్, మార్చి 8 : బాల్యవివాహాలను చట్టంతో కన్నా ప్రజలను చైతన్యం చేయడంతోనే నివారించవచ్చని కలెక్టర్ హరిచందన అన్నారు. అంతర్జాతీయ మ హిళా దినోత్సవం సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని శీలా గార్డెన్ ఫంక్షన్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. ఐసీడీఎస్, ఐసీపీఎస్ శాఖలు ఎంతగా పని చేస్తున్నా వారికి ప్రజాప్రతినిధులు మద్దతు ఇస్తేనే ఏ సమ స్య అయినా అధిగమించగలమన్నారు. అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అంగన్వాడీ సేవలు బా గానే ఉన్నప్పటికీ పిల్లల్లో ఇంకా పౌష్టికాహార లోపం ఉండ డం ఇబ్బందికరమైన విషయమన్నారు. జిల్లాలో వయస్సు కు తగ్గ బరువు లేని పిల్లల్ని దత్తత తీసుకొని మూడు నెలల్లో సాధారణ స్థాయికి తెచ్చేందుకు ముందుకు వచ్చిన ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. చిన్న పిల్లలతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆకట్టుకున్నాయి. అంతకుముం దు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రా రంభించారు. అనంతరం ఐసీపీఎస్, ఐసీడీఎస్, అంగన్వాడీ టీచర్లకు ప్రశంసాపత్రా లు అందజేశారు. కార్యక్రమంలో రెవె న్యూ అదనపు కలెక్టర్ పద్మజారాణి, జెడ్పీ సీఈవో సిద్ధిరామప్ప, డిప్యూటీ సీఈవో జ్యోతి, సీడీపీవోలు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
ర్యాలీని ప్రారంభించిన జెడ్పీ చైర్పర్సన్…
మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జెడ్పీ కార్యాలయం నుంచి శీలా గార్డెన్ వరకు నిర్వహించిన ర్యాలీని జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.