నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు
సీఎం కేసీఆర్ సభకు తరలిరావాలి : జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
నవాబ్‌పేట, మార్చి 7 : అర్హులందరికీ డబుల్బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తామని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అ న్నారు. మండలంలోని ఫత్తేపూర్ మైసమ్మ ఆలయ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో ఫిల్టర్ వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీమేరకు సొంత జాగా ఉన్నవారికి డబుల్‌బెడ్‌రూ ఇండ్లు నిర్మించేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించినట్లు తెలిపారు. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం వనపర్తిలో నిర్వహించే ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ మాడెమోని నర్సింహులు, వైస్‌ఎంపీపీ సంతోష్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మధుసూదన్‌రెడ్డి, మైసమ్మ ఆలయ కమిటీ చైర్మన్ పాశం గోపాల్, సర్పంచులు జంగమ్మ, గోపాల్‌గౌడ్, యాదయ్యయాదవ్, వెంకటేశ్, ఎంపీటీసీ రాధాకృష్ణ, కోఆప్షన్ సభ్యుడు తాహెర్, నాయకులు నాగిరెడ్డి, మెండె లక్ష్మ య్య, పాశం కృష్ణయ్య, రాజ్‌కుమార్, నర్సింహులు, నరేందర్, సుభాన్ ఆచారి, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మన పథకాలు దేశానికే ఆదర్శం
మిడ్జిల్, మార్చి 7 : రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అమ లు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని దుందుభీవాగులో రూ.4కోట్ల 30లక్షల 70వేలతో చేపట్టనున్న చెక్‌డ్యాం ని ర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ దుందుభీవాగులో చెకుడ్యాంల ఏర్పాటుతో భూగర్భజలాలు పెరిగి వ్యవసాయానికి నీటి సమస్య ఉండదన్నా రు. పంటల సాగుకు నీటి వసతితోపాటు 24గంటల కరెంట్, పెట్టుబడి సాయం, రైతుబీమా తదితర పథకాలను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. చెక్‌డ్యాం నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శశిరేఖ, ఎంపీపీ కాంతమ్మ, స ర్పంచ్ రాధికారెడ్డి, ఎంపీటీసీలు సుదర్శన్, గౌస్, ఉపసర్పం చ్ పద్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాండు, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, సుధాబాల్రెడ్డి, బాలయ్య, దానియేలు, బాలు, వెంకట్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, శేఖర్, వెంకట్, బాబా, శ్రీనివాసులు, గోపాల్, భీంరాజు, బంగారు, కాడయ్య, ఆచారి, మల్లయ్య, తిరుపతినాయక్, నవీనాచారి పాల్గొన్నారు.
మహిళా సంక్షేమానికి పెద్దపీట
రాజాపూర్, మార్చి 7 : మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసి పథకాలను అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలకేంద్రంలో నిర్వహించిన రైతుబంధు సంబురాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ సుశీలతోపాటు వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళలను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహిళలతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో సంగీత, నాటక అకాడమీ మాజీ చైర్మన్ శివకుమార్, జెడ్పీటీసీ మోహన్‌నాయక్, వైస్‌ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, ఎంపీటీసీ అభిమన్యురెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు నర్సింహులు, టీఆర్ఎస్ యూత్వింగ్ అధ్యక్షుడు వెంకటేశ్, ఆనంద్‌గౌడ్, తాసిల్దార్ శంకర్, ఎంపీడీవో లక్ష్మీదేవి, నాయకులు నరహరి, వెంకటయ్యగౌడ్, రామకృష్ణాగౌడ్, యాదగిరి, విజయ్, దేవేందర్, రియాజ్, సత్యయ్య, తిరుపతయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.