బీచుపల్లి, కందూరు ఆలయాల్లో పూజలు చేసిన న్యాయమూర్తి శ్రీదేవి
మహబూబ్‌నగర్ కోర్టు సందర్శన
జిల్లా కోర్టుల్లో అధికారులను నియమించాలంటూ వినతులు
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ/ఇటిక్యాల/మూసాపేట/గద్వాల అర్బన్, మార్చి 5: జోగుళాంబ గద్వాల జి ల్లాలోని బీచుపల్లి క్షేత్రంలోని అంజనేయస్వామిని హై కోర్టు న్యాయమూర్తి శ్రీదేవి శనివారం దర్శించుకున్నా రు. ఈ సందర్భంగా న్యాయమూర్తికి ఆలయ కార్యనిర్వహణ అధికారి రామన్‌గౌడ్ ఆలయ అర్చకులు మారుతీచారి, సందీపాచారి, ఆలయ సిబ్బంది పూర్ణకుంభం తో స్వాగతం పలికారు. ఈవో స్వామివారి శేషవస్త్రంతో సన్మానించి ప్రసాదాలను అందజేశారు. అనంతరం మ హబూబ్‌నగర్ జిల్లాలోని కందూరు రామలింగేశ్వరస్వామికి న్యాయమూర్తి శ్రీదేవి, జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఉమాదేవి ప్రత్యేక పూజలు చేశారు. హైకోర్టు జడ్జి శ్రీదేవిని గద్వాల న్యాయవాదులు శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కోర్టు బిల్డింగ్,గద్వాల సబ్ జడ్జి రెగ్యులర్ కోర్టు అధికారిని నియమించాలని కోరారు. అంతకుముందు శ్రీదేవి మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లా కోర్టును సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి ప్రేమావతి, ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు, అధికారులు, పీపీలు, న్యాయవాదులు, తాసిల్దార్ ఆమెను మర్యాద పూర్వకంగా కలిశారు. కొత్త జిల్లాలో జిల్లా కోర్టును ఏర్పాటు చేయాలని పలువురు న్యాయవాదులు కోరారు. వారి వెంట అలంపూర్ జడ్జి కవిత, తాసిల్దార్ సుబ్రమణ్యం, ఎస్సైలు గోకారి, విజయ్‌కుమార్, ఆర్ఐ ప్రశాంత్‌గౌడ్, న్యాయవాదులు మదన్ మోహన్‌రెడ్డి, సత్యారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, పూజారి శ్రీధర్, మనోహర్, మహేశ్ యాదవ్, ప్రభుత్వ న్యాయవాది కృష్ణారెడ్డి పాల్గొన్నారు.