నేటి నుంచి ఆత్మకూరులో జాతర
చరిత్రకెక్కిన పురాతన ఆలయం
చెరువులో వెలిసిన ఈశ్వరుడు
కరువైన ఆదరణ.. ఉత్సవాలప్పుడే పట్టింపు
ఆత్మకూరు, మార్చి 2 : భక్తుల కొంగు బంగారంగా.. కోరిన కోర్కెలు తీర్చే ఈశ్వరుడిగా ఆత్మకూ రు చెరువులో వెలిసిన పరమేశ్వరుడు విరాజిల్లుతున్నాడు. స్వయంభూగా వెలసిన ఆత్మలింగం పేరిట ఆత్మకూరు పట్టణం ఏర్పడిందని చరిత్ర ప్రకారం తెలుస్తున్నది. అత్యంత మహిమాన్వితమైన ఈశ్వరుడు రాజుల కాలంకంటే ముందే ఇక్కడ వెలిసినట్లు ఆధారాలు చెబుతున్నాయి. సంస్థానాధీశులు దేవాలయానికి మండపం కూడా నిర్మించారు.
ఆలయ చరిత్ర..
చరిత్ర ప్రకారం.. దాదాపు 460 ఏండ్ల కిందట స్వయంభూ శివలింగం వెలిసింది. ఆత్మకూరులో చెరువు ఏర్పాటుకు ముందే ఆలయాన్ని నిర్మించా రు. అప్పట్లో ఈ ప్రాంతంలోని భూములను కుమ్మరులు సాగుచేసేవారు. కాగా, ఓ కుమ్మరి తమ పొ లాన్ని చదును చేసేందుకు నాగలిపై ఒక రాయి పె ట్టి దున్నాడు. సాయంత్రం ఆ రాయిని తీసి పక్కకు పెట్టి వెళ్లిపోయాడు. మర్నాడు ఉదయం వచ్చి చూ సే సరికి ఆ రాయి తాను పెట్టిన స్థలంలో కాకుండా పూర్వస్థానంలో కనబడింది. రోజూ ఇలానే జరిగేది. లింగం ఆకారంతో ఉన్న ఆ రాయిని ఎక్కడ వదిలినా.. తెల్లారేసరికి ప్రస్తుతం ఆలయం ఉన్నచోటకే వచ్చి ఉండేది. విషయాన్ని తెలుసుకునేందుకు ఓ రోజు రాత్రి కాపలా కాశాడు. అదే రోజు రాత్రి సద రు రైతు భార్య కలలో దర్శనమిచ్చిన అశుతోషుడు తాను స్వయంభూగా వెలిసినట్లు చెప్పాడట. దీం తో ఆ రైతు రాయిని అక్కడే ప్రతిష్ఠించి పూజలు చేశాడు. కొద్ది రోజుల తరువాత గోపాల్పేటకు చెం దిన గాజుల వ్యాపారులు తమ కోరికలు తీరిన సం దర్భంలో గర్భగుడిని నిర్మించారు. 1730లో సం స్థానాధీశులు తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో గుడిమండ పం నిర్మించారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేని వి ధంగా గంగ, గౌరి సమేతంగా పరమేశ్వరస్వామి ఇక్కడ కొలువుదీరాడు. ఆనాటి నుంచి భక్తుల ఇలవేల్పుగా, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పరమేశ్వరుడు వెలుగొందుతున్నాడు.
గతమెంతో ఘనం..
గతమెంతో ఘనంగా.. ఇప్పుడంతా శూన్యంగా మారిందీ ఆలయ పరిస్థితి. ఘనమైన చరిత్ర కలిగిన పరమేశ్వరస్వామి ఆలయం ప్రస్తుతం నిర్వహణకు నోచుకోవడం లేదు. ఆలయం నిత్యం చెరువులో ఉన్నప్పటికీ చెక్కుచెదరని కళాఖండంగా భా సిల్లుతున్నది. గర్భగుడి కూలిపోయే పరిస్థితుల్లో ఉండడంతో నాలుగేండ్ల కిందట ప్రారంభించిన మ రమ్మతులు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. 1986కు ముందు అత్యంత వైభవంగా జరిగిన ఆ త్మకూరు జాతర మహోత్సవం.. కరువు కారణంగా వైభవాన్ని కోల్పోయింది. ప్రస్తుతం దాతల సహకారంతో జాతరను నిర్వహిస్తున్నారు. స్వరాష్ట్రం ఏర్పడ్డాక ఆనాటి పాలకవర్గం ప్రతినిధులు పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. మటన్, కుండల మార్కెట్, సంత బజార్, మిఠాయిలు, గాజుల దుకాణాలు, టూరింగ్ టాకీస్, ఎ ద్దుల బండలాగుడు పోటీలు, కబడ్డీ, వాలీబాల్ త దితర పోటీలు నిర్వహిస్తున్నారు. దీంతో కాస్త పూ ర్వవైభవం వచ్చినట్లు ఉన్నది.
జాతరకు సర్వం సిద్ధం..
ఆత్మకూరు చైర్పర్సన్ గాయత్రీయాదవ్ నేతృత్వంలో పాలకవర్గం, ఆలయ అభివృద్ధి కమిటీ ప్ర తినిధుల ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించన్నారు. శివరాత్రి తరువాత వచ్చే అమావాస్య మరుసటి రోజు నుంచి అంటే గురువారం నుంచి 15 రోజుల పాటు జాతర కొనసాగుతుంది. ఈ క్ర మంలో ఈనెల 3న మొదటి తేరు, 4న రెండో తేరు, 5వ తేదీన మూడో తేరు (రథోత్సవం) నిర్వహించనున్నారు. రథానికి రంగులు వేసి సిద్ధం చేశా రు. ఈ ఏడాది శ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆల యం వరకు రోడ్డు వేశారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా తగిన వసతులు కల్పించనున్నట్లు పా లకవర్గం ప్రతినిధులు పేర్కొన్నారు.