ఊట్కూర్, ఫిబ్రవరి 3 : రైతుబంధు సమితి సభ్యులు రై తులకు నిరంతరం అందుబాటులో ఉంటూ.. సూచనలు, సలహాలు ఇవ్వాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సూ చించారు. గురువారం స్థానిక రైతువేదికలో మండలంలోని రైతుబంధు సమితి సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అందిం చే పెట్టుబడి సాయాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
వ్యవసాయంలో లాభాలు పొందేందుకు రై తుబంధు సమితిలు కృషి చేయాలన్నారు. అనంతరం రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు సుధాకర్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సుధాకర్‌రెడ్డిని సన్మానించారు. సమావేశంలో ఎంపీపీ లక్ష్మి, జెడ్పీటీసీ అశోక్‌కుమార్‌గౌడ్, పీఏసీసీఎస్ చైర్మన్ బాల్‌రెడ్డి, సర్పంచ్ సూర్యప్రకాశ్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ అరవింద్‌కుమార్, టీఆర్ఎస్ మండల అ ధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మారెడ్డి, శివరామరాజు, పట్టణ అ ధ్యక్షుడు వెంకటేశ్‌గౌడ్, యువజన విభాగం మండలాధ్యక్షుడు ఆనంద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ..
మండలంలోని ఊజ్జెల్లి గ్రామనికి చెందిన టీఆర్ఎస్ మండల కార్యవర్గ సభ్యుడు రవికాంత్‌రెడ్డి బుధవారం గుండెపోటుతో మరణించాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చిట్టెం గురువారం రవికాంత్ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాధిత కు టుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే మండల కేంద్రానికి చెందిన సిద్ధప్ప భార్య ఇటీవల మరణించడంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో జె డ్పీటీసీ వెంకటయ్య, పీఏసీసీఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, స ర్పంచ్ అశోక్‌గౌడ్, నాయకులు ఎల్లారెడ్డి, శ్రీనివాస్, రా ము, మైపాల్‌రెడ్డి, ఈశ్వర్ యాదవ్, రాజు పాల్గొన్నారు.
సీఐకి అభినందనలు..
మక్తల్ సీఐ సీతయ్య గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన శంకర్ హైదరాబాద్‌లోని ఐజీ ఆఫీస్‌కు బదిలీపై వెళ్లగా.. మహబూబ్‌నగర్ సీసీఎస్ కార్యాలయంలో పనిచేస్తున్న సీతయ్య మక్తల్ కు వచ్చారు. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డిని సీఐ మర్యా ద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐకి ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై రాములు, పోలీసులు ఉన్నారు.
సాఫీగా సర్వసభ్య సమావేశం..
మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన సర్వసభ్య సమావేశం సాఫీగా సాగింది. ఎంపీపీ శ్యామలమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే చిట్టెం హాజరై మాట్లాడారు. ఈ నెల ఒకటో తేదీన పాఠశాలలకు హాజరైన విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య నివేదిక అందజేయాలని ఎంఈవోకు సూచించారు. సమావేశంలో జెడ్పీటీసీ వెంకటయ్య, పీఏసీసీఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్‌గౌడ్, వైస్ ఎంపీపీ తిప్పయ్య, ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, తాసిల్దార్ తిరుపతి, డీటీ అమిర్, ఎంపీవో జైపాల్‌రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.