హన్వాడ, ఫిబ్రవరి 3 : హన్వాడ పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా ఏర్పాటు చేసి పర్యాటకంగా అభివృద్ధి చే స్తానని ఎక్పైజ్, క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపా రు. గురువారం మండలంలోని పల్లెమోని కాలనీ, కొత్తచెరువు తండా, హన్వాడ, గుడిమల్కాపూర్, కొత్తపేట, టంక ర గ్రామాల్లో రూ.11.78 కోట్లతో నిర్మించిన తాగునీటి ట్యాంకులు, సీసీ రోడ్లు, అంగన్వాడీ భవనం, నాయీబ్రాహ్మణ, రైతు వేదిక భవనాలను ప్రారంభించారు. అలాగే మహిళలకు రూ.20 కోట్ల స్త్రీనిధి రుణాలను అందజేశారు. రూ.9 కోట్లతో హన్వాడ, టంకర, గుడిమల్కాపూర్ వరకు చేపట్టిన బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బ్యాంకు లింకేజీతో మహిళా సంఘా లకు రూ.5.87 కోట్ల రుణాలు అందించామన్నారు.
మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకోవడంతోపాటు సమయానికి చెల్లించాలని తెలిపారు. హన్వాడ చెరువులో నిర్మించిన అక్రమ కట్టడాలను పరిశీలించి నివేదిక అందించాలని తాసిల్దార్ శ్రీనివాసులును ఆదేశించారు. గ్రామాభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజు, జెడ్పీటీసీ విజయనిర్మల, వైస్ ఎంపీపీ లక్ష్మి, సింగిల్‌విండో చైర్మన్ వెంకటయ్య, వైస్ చైర్మన్ కృష్ణయ్యగౌడ్, రైతుబంధు సమితి కన్వీనర్ రాజుయాదవ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్, ఎంపీడీవో ధనుంజయగౌడ్, ఏపీఎం సుదర్శన్, ఏవో కిరణ్‌కుమార్, సర్పంచులు వెంకటమ్మ, రేవతి, బాలగౌడ్, అచ్చన్న, చెన్నమ్మ, ఎంపీటీసీలు కల్పన, లక్ష్మమ్మ, అరుణ్, నాయకులు పాల్గొన్నారు.