
నల్లమల ప్రత్యేకమైన బ్రీడ్‌కు గుర్తింపునిచ్చిన ఐకార్
జాతిని కాపాడుతున్నందుకు జాతీయ అవార్డు
పశుసంవర్ధక భవన్లో మన ఎద్దు సగర్వ స్వాగతం
తెలంగాణలో ఉదయించిన పొడ తూర్పు
నల్లమల బ్రీడ్‌కు ప్రత్యేక గుర్తింపు
ఈ జాతిని సంరక్షిస్తున్నందుకు అమ్రాబాద్ పొడలక్ష్మి గోవు సంఘానికి అవార్డు
ప్రతికూల వాతావరణంలో పనిచేసే పశువులు
రాష్ట్ర పశుసంవర్ధక భవన్లోమన ఎద్దు ప్రతిమ సగర్వ స్వాగతం
పదునైన కొమ్ములు.. మూరెడు మూపురం.. అత్యంత బలమైన గెట్టలు.. నేలను తాకే గంగడోలు.. కొండనైనా లాగేంత కండల బలం.. కాడి కడితే చాలు సునాయాసంగా లాగే బలిష్టం.. ఎంత దూరమైనా పరుగెత్తే దృఢత్వం.. పులిని తలపించే చారలు.. సునాయసంగా నదిని ఈదేంత శక్తి.. పులులకు సైతం ఎదురొడ్డి నిలబడే ధైర్యం వీటి సొంతం.. తెలంగాణలోనే గుర్తింపు పొందిన ఏకైక పశుజాతి.. పొడ తూర్పు ఎద్దు ప్రత్యేకం. వీటిలో దొర, ఎర్ర, తెల్ల, పుల్ల, తెల్ల బట్ట, పాల బట్ట, ఎరుపు, నలుపు రకాల పశువులున్నాయి. వర్షం రాకను ఇవి రెండ్రోజుల ముందుగానే గుర్తించే సిక్త్స్ సెన్స్ ఉంటుందని నేషనల్ బయో యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ (ఎన్ఏబీజీఆర్) దేశవ్యాప్తంగా గుర్తించిన 50 పశు జాతుల్లో తూర్పు పొడ 44వ రకం. అందుకే రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యాలయం ఎదుట గిత్త ప్రతిమను ఏర్పాటు చేశారు. నల్లమల రాజసంగానూ వీటిని పిలుస్తారు.
మహబూబ్‌నగర్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ ప్రతిని ధి) : హైదరాబా ద్ శాంతినగర్‌లో తెలంగాణ పశుసంవర్ధక శాఖ రాష్ట్ర కార్యాల యం ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలా రోజులపాటు అక్కడ ఒంగో లు గిత్త చిహ్నం ఆహ్వానం పలికేది. ఒంగోలు గి త్తలు, పుంగనూరు ఎద్దులు, మల్నాడ్ గిద్దలు.. ఇ లా ఇతర ప్రాంతాల వాటితో పోల్చడమే కానీ మ నకంటూ ఓ ప్రత్యేకమైన పశుజాతి లేకపోవడం తెలంగాణ వాసులను ఎంతో బాధించేది. గతేడాది ఫిబ్రవరి 17న మన తూర్పు పొడ జాతి పశువులకు ప్రత్యేకమైన బ్రీడ్ గా గుర్తింపు వచ్చింది. ఇప్పటివరకు దేశంలో 43 పశుజాతులకు గుర్తింపు లభించగా.. తాజాగా నల్లమల తూర్పు పొడ జాతికి సై తం అవకాశం లభించింది. దీంతో తెలంగాణ పశుసంవర్ధక భవన్ ఎదుట ఉన్న ఒం గోలు గిత్త చిహ్నాన్ని తొలగించి సగర్వంగా మన తెలంగాణ జాతి అయిన నల్లమల పొడ తూర్పు జాతి ఎద్దు చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద పులిని తలపించే మచ్చలతో సగర్వంగా స్వాగతం పలుకుతున్న మన పొడ జాతి ఎందరినో ఆకట్టుకుంటున్నది. మరోవైపు దాదాపుగా 400 ఏండ్ల నుంచి స్థానిక పశు జాతిని కాపాడుతున్నందుకుగానూ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న బయో డై వర్సిటీ అవార్డు 2021 ఏడాదికి అమ్రాబాద్ పొ డలక్ష్మి గోవు సంఘానికి వచ్చింది. అవార్డుతోపా టు రూ.5 లక్షల నగదు బహుమతి లభించింది.
నల్లమల రాజసం.. పొడ తూర్పు..
పొడ తూర్పు పశు జాతి నల్లమల అటవీ ప్రాం తంలోని అమ్రాబాద్, పదర, లింగాల, అచ్చంపేట, బల్మూరు మండలాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. తెలంగాణ స్థానిక పశు జాతిగా నేషనల్ బయో యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ (ఎన్ఏబీజీఆర్) గుర్తించింది. ఎన్ఏబీజీఆర్ దేశవ్యాప్తంగా గుర్తించిన పశు జాతుల్లో తూర్పు పొడ ఒకటి. ఎ న్ఏబీజీఆర్ జాబితాలో పొడతూర్పునకు 44వ సీరియల్ నెంబర్‌గా నమోదైంది. తెలంగాణలో గుర్తింపు పొందిన ఏకైక పశు జాతి తూర్పు పొడ మాత్రమే. సూటి, పదునైన కొమ్ములను కలిగి ఉంటాయి. అన్ని కాలాల్లో ఈ పశువులు వ్య వసాయ పనులు చాలా సమర్థవంతంగా చేస్తా యి. వీటి ఉత్పాదక శక్తి చాలా ఎక్కువ. నీరు, మే త తక్కువగా తీసుకోవడం వీటి ప్రత్యేకత. ఎత్తైన కొండలు, కోనల్లోకి సులభంగా ఎక్కేలా వీటి గె ట్టలు అత్యంత బలంగా ఉంటాయి. 8 కి.మీ ఎ త్తైనా అమాంతం ఎక్కేస్తాయి. శ్రీశైలం ప్రాజెక్టు గే ట్లు తెరిచినప్పుడే సునాయసంగా నదిని ఈదేంత బలం ఉన్న పశుజాతి. నల్లమల అటవీ ప్రాంతం లో ఉండే ఈ పశువులు పులులకు సైతం ఎదురొ డ్డి నిలబడతాయని స్థానికులు చెబుతారు. అచ్చం పులిని మరిపించేలా చారలను కలిగి ఉండడం వీ టి ప్రత్యేకత. బారెడు కొమ్ములు, మూరెడు మూ పురం, నేలను తాకే గంగడోలు.. కొండనైనా లా గేంత కండల బలం, కాడి కడితే చాలు ఎంతటి బరువునైనా సునాయాసంగా లాగేసే బలిష్టం ఎం త దూరమైన పరుగెత్తే బలం ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత, గజగజ వణికించే చలిలోనూ ఉత్సాహంగా పనిచేస్తాయి. ఆవులు పగలంతా వ్యవసా యం చేసిన తర్వాత కూడా ఒక్కపూటకు 3 నుం చి 5 లీటర్ల పాలు ఇస్తాయి. ఇలా పాడితోపాటు వ్యవసాయానికి అనుకూలంగా ఉండడంతో ధరకైనా కొనుగోలు చేసేందుకు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇవి ఉన్న ప్రాంతంలో పులి తిరిగినా గుర్తిస్తాయి. దొర పొడలు, ఎర్ర పొడలు, తెల్ల పొ డలు, పుల్ల బట్ట, తెల్ల బట్ట, పాల బట్ట, ఎరుపు, నలుపు రకాల పశువులున్నాయి. ఎరుపు గోధు మ రంగు మచ్చలు కలిగిన ఈ గిత్తలకు కొమ్ములు నిటారుగా ఉంటాయి. ఈ జాతి పశువులు వర్షం రాకను రెండు, మూడు రోజుల ముందుగానే గు ర్తించి గమ్యస్థానానికి చేరుకుంటాయని పెంపకందారులు చెబుతున్నారు. బురదలో సైతం సులువుగా దున్నగలవు. ఈ మచ్చల పశువులు గట్టిదనానికి కారణమైన జన్యులక్షణం పొడి వాతావరణంలో కూడా అవలీలగా బతికేలా ఉంటుందని జీవవైవిధ్య సంస్థ అధ్యయనంలో తేలింది. నల్లమల ప్రాంత రైతులు ఇక్కడి ఈ మచ్చల జాతి ప శువులతోనే తాత ముత్తాల నుంచే వ్యవసాయం చేస్తున్నారు. అమ్రాబాద్ మండలంలోని లక్ష్మాపూర్ తండా నుంచి నల్లమల ప్రాంతంలోని దట్టమైన వజ్రాలమడుగు, గుండం, కొల్లం, గుజనేనిగడ్డ, మల్లెలరేవు, చిన్నమాల్బండ, బోల్గెట్టి, ము త్యాలమ్మగడ్డి, నల్లమల పరిధిలోని కృష్ణానదీ తీరం తదితర ప్రాంతాలకు రైతులు మేతకు తీసుకెళ్తుంటారు. ఈ అరుదైన జాతి పశువులు రాష్ర్టానికే ఖ్యాతి తెచ్చిపెట్టాయి. అంతర్జాతీయ గుర్తింపు లభించడంతో ఇక్కడి పశువులకు డిమాండ్ పె రిగి.. రైతులు ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుం ది. ప్రభుత్వం ద్వారా సబ్సిడీ రుణాలు తీసుకునే క్రమంలోనూ ఈ జాతి పశువులను అధికారికం గా కొనుగోలు చేసేందుకు అవకాశం ఏర్పడింది.
మార్కెట్లో మంచి గిరాకీ..
ప్రత్యేక విశిష్టతలు కలిగిన పొడ తూర్పు పశువులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉన్నది. కోడె గిత్త రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు పలుకుతున్నది. ఏడాది వయసున్న దూడలను కూడా రూ.25 వేల నుంచి రూ.40వేల వరకు విక్రయిస్తారు. వీటిని ప్రసిద్ధిచెందిన కురుమూర్తి జాతర ఉత్సవాల్లో బేరానికి పెడతారు. పశువులను కొనడానికి కర్ణాటక, ఏపీ నుంచి కూడా తరలివస్తారు.
సంస్కృతిలో భాగంగా..
బంజారాలు, గొల్ల కురుమల సంస్కృతిలో భాగమైన ఈ పశువులను తమ తాత ముత్తాతల వారసత్వంగా భావించి పోషిస్తారు. ఈ పశువుల పాలు ఎంతో శ్రేష్టమైనవని స్థానికులు చెబుతున్నారు. బంజారాలు తమ కూతు రు పెండ్లి చేసినప్పుడు ఆవు, ఎద్దు ను కానుకగా ఇచ్చి పంపిస్తారు. పెండ్లికూతురును ఎద్దుపై కూర్చోబెడతారు. ‘నేను నిన్న కన్న బిడ్డలా చూసుకున్నాను. నా తల్లిదండ్రులు ఎలాగూ నా వెంట రాలేరు. నీవై నా నాతో వచ్చెయ్’ అంటూ పెండ్లికూతురు పాట పాడుతుంది. ఏదై నా పులి వచ్చి ఆవును తిన్నా కూ డా ఇక్కడి వారు బాధపడరు. పెద్ద మ్మ తల్లి తమ ఆవును తీసుకుపోయిందని భావిస్తారు.
పులికి ఎదురుతిరిగే ధైర్యం..
నల్లమల పొడ తూర్పు జాతి పశువు లే మా సర్వస్వం. తాత ముత్తాతల నుంచి అనుబంధం ఉన్నది. ప్రతి ఇం టి ముందు ఈ పశువులు కనిపిస్తాయి. ఈ పశువులు పులిని కూడా ధైర్యంగా ఎదిరించి నిలబడిన సందర్భాలున్నా యి. ప్రత్యేకమైన పశు జాతి అనే విష యం మాకు తెలియదు. వాసన్ స్వ చ్ఛంద సంస్థ ప్రతినిధులు అనేకమార్లు అధ్యయనం చేశారు. ఎన్ఏబీజీఆర్ సంస్థకు దరఖాస్తు చేసి పొడ తూర్పునకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు. పశు జాతిని కాపాడుతున్నందుకు కేంద్ర ప్రభుత్వం అవార్డు లభించింది. అవార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ‘వాసన్’ ప్రతినిధులు ఎంతగానో సహకరించారు. పర్యావరణ మంత్రిత్వ శాఖ, నేషనల్ బయో డైవర్సిటీ అథారిటీ, యూఎన్డీపీ సంయుక్త ఆధ్వర్యంలో ఇచ్చే అవార్డును కరోనా కారణంగా కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆన్లైన్ ద్వారా అందజేశారు. – గంటల హనుమంతు చౌహాన్, అధ్యక్షుడు, అమ్రాబాద్ పొడలక్ష్మి గోవు సంఘం
విడదీయలేని బంధం..
నాగర్‌కర్నూల్ జిల్లాలో తొలిసారిగా మా సిబ్బంది పొడ తూర్పు పశువులను గమనించి సమాచారం ఇచ్చారు. ఎం తో ఆసక్తిగా అనిపించాయి. వీటి గురిం చి నల్లమల, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో తప్పా ఎవరికీ తెలియదు. ఈ విషయాన్ని మా సంస్థ ఉన్నతాధికారులకు వివరించాం. పశువుల ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నించాం. స్థానికులతో వీటికి ఉన్న అనుబంధం విడదీయలేనిది. తెలంగాణ జీవ వైవిధ్య మండలి, అమ్రాబాద్ పొడలక్ష్మి గోవు సంఘం సహకారంతో దరఖాస్తు చేయగా.. గతేడాది జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. ఇకపై తెలంగాణ బ్రీడ్ అంటే పొడ తూర్పు అని సగర్వంగా చెప్పే అవకాశం వచ్చింది. పశువుల పెంపకానికి సబ్సిడీ రుణాలు తీసుకుంటే పొడతూర్పు పశువులను సైతం అధికారికంగా కొనుగోలు చేయొచ్చు.ఈ జాతిని కాపాడేందుకు ప్రభుత్వం సైతం జాగ్రత్తలు తీసుకోనున్నది.
ఆగ్రో బయో డైవర్సిటీ పరిశోధకుడు అరుదైన గుర్తింపు..
తెలంగాణ జీవవైవిధ్య, వాసన్ స్వచ్ఛంద సంస్థలు పొడ తూర్పు జాతికి అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చేందుకు కృషి చేశాయి. అమ్రాబాద్ పొడలక్ష్మి గోవు సంఘం సభ్యులతో కలిసి వీరు పనిచేశారు. ఎన్ని పశువులు ఉన్నాయో గుర్తించి, ప్రత్యేకతలను నమోదు చేశారు. దశాబ్దాలుగా నల్లమల వాసులతో పెనవేసుకుపోయిన ఈ జాతిని ప్రపంచానికి పరిచయం చేశారు. భారత వ్యవసాయ పరిశోధన మండలిలో భాగమైన భారత పశు జన్య వనరుల మండలి ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీన గుర్తింపు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ఒంగోలు గిత్త, పుంగనూరు ఎద్దులు, తమిళనాడులో ఉంబ్లాచెరీ, పుల్లికులం, కర్ణాటకలో అమృత్ మహల్, కృష్ణవ్యాలీ, హల్లికర్, కేరళలో పెచ్చూరు జాతి పశువుల మాదిరిగానే తెలంగాణలోని నల్లమల పొడ తూర్పు జాతి పశువులకు ఖ్యాతి దక్కింది. తెలంగాణ జీవ వైవిద్య మండలి కార్యదర్శి సి.సువర్ణ ఎంతగానో సహకరించారని వాసన్ స్వచ్ఛంద సంస్థ ఆగ్రో బయోడైవర్సిటీ పరిశోధకుడు కన్నకుమార్ సిరిపురపు, డైరెక్టర్ సబ్యసాచి దాస్ తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం, జాతీయ స్థాయి అవార్డు రావడంపై నల్లమల వాసులతో పాటు ఉమ్మడి జిల్లా ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
చాలా బలమైన పశువులు..
పొడతూర్పు పశువులను కురుమూర్తి జా తరలో విక్రయిస్తారు. వికారాబాద్‌లో పనిచేస్తున్నప్పుడు ఈ జాతి ఎద్దులను చూశాను. న ల్లమలకు సంబంధించినవని అక్కడి వారు చె ప్పారు. మా సంస్థ తరఫున అధ్యయనం చే శాం. ఎంతో ప్రాచీనమైన పశుజాతిగా గు ర్తించాం. వీటి పోషణకు రైతులు గుంపులుగా అడవుల్లోకి వెళ్తారు. నిబంధనల మేరకు గుర్తింపు కోసం కృషి చేయగా ఫలితం దక్కింది. గుర్తింపు తర్వాత పశువుల విలువ పెరిగింది. గతంలో రూ. 40 నుంచి 80 వేల వరకు విక్రయించగా, ఇప్పుడు ఒక్క కోడె గిత్త రూ.లక్షకు పైగా విలువ చేస్తోంది. ప్రభుత్వమే వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా చేపడుతున్నది. తెలంగాణ పశుసంవర్ధక భవన్ వద్ద అంతకు ముందు ఉన్న ఒంగోలు గిత్త చిహ్నాన్ని తొలగించి పొడ తూర్పు ఎ ద్దు చిహ్నాన్ని ఉంచారు. తెలంగాణ ఔనత్యాన్ని చాటేలా కృషి చేశాం.