
మహబూబ్‌నగర్, ఆగస్టు 13: అన్ని హంగులతో సమీకృత జిల్లా కార్యాలయ భవనాన్ని తీర్చిదిద్దాలని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. నూతన సమీకృత జిల్లా కార్యాలయ భవన నిర్మాణాన్ని శుక్రవారం మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉద్యాన, లాన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఆర్చి పనులను వేగవంతం చేయాలని, కలెక్టరేట్ పక్కనే భూత్పూర్ నుంచి వచ్చేవారికి సౌకర్యంగా బస్సులు నిలిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆటో నిలిపేందుకు ఏర్పాటు చేయాలని, అన్ని వసతులు ఉండేలా చూడాలన్నారు. మంత్రి వెంట కలెక్టర్ వెంకట్రావు, ఈఈ స్వామి, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ సంధ్య, ఆయా శాఖల అధికారులు ఉన్నారు.
మహబూబ్‌నగర్‌టౌన్, ఆగస్టు 13: రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అన్నివిధాలా కృషి చేస్తున్నదని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పాతపాలమూరులో రూ.20లక్షలతో నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అదనపు గదులను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో 70ఏండ్లు గడిచినా సరైన విద్యావసతులు లేవని, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. చదువుకుంటేనే పేదల జీవితాలు బాగుపడతాయన్న అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. మహబూబ్‌నగర్ పట్టణంలో 20 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యనందిస్తున్నామన్నారు. జిల్లా కేంద్రంలో పాడుబడిన పాఠశాలలను గుర్తించి వాటి స్థానంలో కొత్త భవనాలు ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. పాతపాలమూరులో సూమారు 100మందికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చామని, రాబోయే రోజుల్లో మహబూబ్‌నగర్‌ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. శివశక్తినగర్‌లో మట్టి వినాయకుల కేంద్రాన్ని పరిశీలించి కేంద్రం నిర్వాహకుడు శ్రీకాంతాచారిని అభినందించారు. ప్రతిఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, డీఈవో ఉషారాణి, డీఈ రాములు, ఎంఈవో జయశ్రీ, కౌన్సిలర్లు శ్రీనివాసులు, తిరుపతమ్మ, నాయకులు నవకాంత్, శ్యామ్‌సుందర్ తదితరులు పాల్గొన్నారు.