
మహబూబ్‌నగర్ టౌన్, జూలై 2 : పట్టణప్రగతి కార్యక్రమంతో మున్సిపాలిటీల్లో స్పష్టమైన మార్పు రావాలని డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ కమిషనర్ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో పర్యటించి పట్టణప్రగతి పనులను తనిఖీ చేశారు. బైపాస్‌రోడ్డులో హరితహారం మొక్కలు, పాల్కొండలో నర్సరీ, బాలజీనగర్‌లో ప్రకృతివనం పరిశీలించారు. భగీరథ కాలనీలో ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. పాలమూరు విశ్వవిద్యాలయం సమీపంలో కలెక్టర్ వెంకట్రావు, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులుతో కలిసి మొక్కలు నాటారు. అనంత రం తూర్పుకమాన్ దగ్గరున్న రైతుబజార్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణ ప్రకృతి వనాలను ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. ఇంటింటికీ ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేయాలని సూచించారు. కలెక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో రోడ్లకు ఇరువైపులా మొ క్కలు నాటుతున్నామని తెలిపారు. నర్సరీ ల్లో సుమారు 10లక్షల మొక్కలను పెంచుతున్నామని వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, డీఎఫ్‌వో గంగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, మిషన్ భగీరథ ఎస్ఈ వెం కటరమణ, ట్రాన్స్‌కో ఎస్ఈ వెంకటరమ ణ, బీసీ వెల్ఫేర్ స్పెషల్ ఆఫీసర్ ఇందిర, కౌన్సిలర్లు రష్మిత, లక్ష్మి పాల్గొన్నారు.
హరితహారంలోభాగస్వాములు కావాలి
హరితహారం కా ర్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ కమిషనర్ సత్యనారాయణ పిలుపునిచ్చారు. జడ్చర్ల మున్సిపాలిటీలో పట్టణప్రగతి కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారి పక్కననున్న మినీ ట్యాంక్‌బండ్‌పై మొక్కలు నాటారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, కమిషనర్ సునీత, తాసిల్దార్ లక్ష్మీనారాయణ, కౌన్సిలర్లు సతీశ్, చైతన్యచౌహాన్, జ్యోతి, టీఆర్ఎస్ నాయకులు రవీందర్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
ప్రతి మొక్కనూ సంరక్షించాలి
హరితహారం కార్యక్రమంలో ప్రతి మొక్కనూ సంరక్షించాలని డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ కమిషనర్ సత్యనారాయణ సూచించారు. భూత్పూర్ మున్సిపాలిటీలో పట్టణప్రగతి పనులను పరిశీలించిన అనంతరం మొక్క లు నాటారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, తాసిల్దార్ చెన్నకిష్టన్న, కమిషనర్ నూరుల్‌నజీబ్ తదితరులు పాల్గొన్నారు.