
మక్తల్ రూరల్, జూలై 2 : మురుగునీరు నిల్వకుండా ప్రతిఒక్కరూ ఇంకుడుగుంతలను నిర్మించుకోవాలని, గ్రా మాలు అభివృద్ధి చెందాలంటే ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యమని కలెక్టర్ హరిచందన, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని మ హాద్వార్లో పల్లె ప్రగతి కార్యక్రమం పండుగ వాతావరణా న్ని తలపించింది. ప్రజలు ఉత్సాహంగా పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే అధ్యక్షతన జరిగిన గ్రామసభలో కలెక్టర్ మాట్లాడుతూ ఈజీఎస్ పథ కం కింద 37 రకాల అభివృద్ధి పనులు చేసుకోవడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు ఈజీఎస్ పనులను చే పట్టడానికి ముందుకు రావాలని ఆమె కోరారు. పరిసరాల ను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల వ్యాధులను దూరం చేయవచ్చునన్నారు. అనంతరం డంపింగ్ యార్డును కలెక్టర్, ఎమ్మెల్యే, జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ పరిశీలించారు.
సమన్వయంతో ముందుకు రావాలి
గ్రామాల్లో అభివృద్ధి పనుల విషయంలో ప్రజలు రాజకీయాలను పక్కన పెట్టి సమన్వయంతో ముందుకు రావాలని ఎమ్మెల్యే కోరారు. గ్రామంలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలపై చర్చించారు. జీపీ రి కార్డులను పరిశీలించారు. రూ.30 లక్షల జీపీ నిధులు ఉ న్నాయని అధికారులు తెలిపారు. నిధులను అభివృద్ధి పను ల కోసం ఖర్చు పెట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రా మాన్ని బాగు చేసుకోవాలని, ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం చేయడం తగదని ఎమ్మెల్యే హెచ్చరించారు. అనంతరం గట్టు తిమ్మప్ప స్వామి ఆలయ ఆవరణలో మొక్కలను నా టి నీళ్లుపోశారు. కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చై ర్మన్ మల్లప్ప, ఎంపీపీ వనజ, ఎంపీడీవో శ్రీధర్, తాసిల్దార్ నర్సింగ్‌రావు, స్పెషల్ అధికారి సుధాకర్, సర్పంచ్ లక్ష్మ మ్మ, ఎంపీటీసీ ఇందిరమ్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పల్లె ప్రగతితోనే గ్రామాల అభివృద్ధి
ఊట్కూర్, జూలై 2 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని పల్లె ప్రగతి ప్రోగ్రాం ప్రత్యేక అధికారి, జెడ్పీ సీఈవో సిద్ధి రామప్ప అన్నారు. మండలంలోని పెద్దపొర్ల, ఓబ్లాపూర్ గ్రామాల్లో నాలుగో విడుత పల్లె ప్రగతి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒ క్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి పచ్చగా ఉండే విధంగా గ్రామస్తులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కాళప్ప, ఎంపీవో రవికుమార్, సర్పంచులు, కార్యదర్శులు, ఉపాధి ఏపీవో ఎల్లయ్య, ఈసీ శ్రీనివాసులు, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ప్రతి మొక్కనూ సంరక్షించాలి
నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని జెడ్పీటీసీ అశోక్‌కుమార్‌గౌడ్, పీఏసీసీఎస్ చైర్మన్ బాల్‌రెడ్డి అన్నారు. మండలంలోని కొల్లూరులో సర్పంచ్ సరోజ ఆధ్వర్యంలో పల్లె ప్రగతి కార్యక్రమానికి హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికే పల్లె ప్రగతి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కలు అధికారులు అందిస్తారని, వాటిని నాటాలని సూచించారు.
ముమ్మరంగా పారిశుధ్యం పనులు
మండలంలోని పలు గ్రామ పంచాయతీల్లో గ్రామ సి బ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశ, ఐకేపీ సిబ్బంది ముమ్మరంగా పారిశుధ్యం పనులు చేపట్టారు. గ్రామాల్లో ప్రధాన వీధుల్లో మురుగు నీటి నిల్వలను తొలగించారు. రహదారులకు ఇరువైపులా ఉన్న కంప చెట్లను తొలగించి శుభ్రం చేశారు. పరిసరాల పరిశుభ్రత, దోమల నియంత్రణ, విష జ్వరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఊట్కూర్, తిప్రాస్‌పల్లి, పులిమామిడి, చిన్నపొర్ల, పెద్దపొర్ల, మల్లేపల్లి, బిజ్వారం గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించారు. ఆయా గ్రామాల్లో సర్పంచులు, కార్యదర్శులు, గ్రా మస్తులు తదితరులు పాల్గొన్నారు.